ఖజ్జియర్
खज्जियार | |
---|---|
![]() ఖజ్జర్ | |
Nickname: భారతదేశంలో మినీ స్విడ్జర్లాండ్ [1] | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | హిమాచలప్రదేశ్ |
జిల్లా | చంబా |
Elevation | 1,920 మీ (6,300 అ.) |
భాషలు | |
• అధికార | హిందీ |
Time zone | UTC+5:30 (IST) |
పిన్ కోడ్ నెంబరు | 176305 |
టెలిఫోన్ కోడ్ | 01899 |
Vehicle registration | HP 48 |
సమీప పట్టణం | డల్హౌసీ |
లోక్‌సభ నియోజకవర్గం | కాంగ్రా లోక్‌సభ నియోజకవర్గం |
విధానసభ నియోజకవర్గం | డాల్హౌసీ |
ఖజ్జియార్ (హిందీ: खज्जियार) హిమాచల్ ప్రదేశ్, చంబ జిల్లాలోని ఒక పర్యాటక ప్రదేశం. డల్హౌసీ నుంచి సుమారు 24 కి.మీ దూరంలో ఉంటుంది.[2]
ఖజ్జియార్ ఒక చిన్న పీఠభూమి మీద ఉంటుంది. దీని మధ్యలో ఒక పిల్ల కాలువ ద్వారా ఏర్పడిన సరస్సు ఉంటుంది. దీని చుట్టూ గుమికూడిన చిన్నా పెద్దా వృక్షసంపద ఉంటుంది. ఇంకా పచ్చటి గడ్డి మైదానాలు, అడవులతో కూడి ఉంది. పశ్చిమ హిమాలయాల్లో భాగమైన ధౌలధర్ పర్వత శ్రేణుల్లో సముద్ర మట్టం నుంది సుమారు 6500 అడుగుల (2000 మీటర్లు) ఎత్తులో ఉంది.దూరం నుంచే ఈ శిఖరాలను దర్శించవచ్చు.[3] ఇది కాలాటోప్ ఖజ్జియార్ అభయారణ్య కేంద్రంలో ఒక భాగం.