ఖజ్రానా గణేష్ దేవాలయం | |
---|---|
ప్రదేశం | |
దేశం: | భారతదేశం |
రాష్ట్రం: | మధ్య ప్రదేశ్ |
జిల్లా: | ఇండోర్ |
ప్రదేశం: | ఇండోర్ |
ఖజ్రానా వినాయక దేవాలయం, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో ఉన్న వినాయకుడి దేవాలయం. ఈ దేవాలయం హోల్కర్ రాజవంశం పాలనలో నిర్మించబడింది.[1]
1735లో హోల్కర్ రాజవంశానికి చెందిన మహారాణి అహల్యాబాయి హోల్కర్ ఈ దేవాలయాన్ని నిర్మించింది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు నుండి సురక్షితంగా ఉంచడానికి వినాయకుని విగ్రహాన్ని బావిలో దాచిపెట్టగా తరువాత వెలికితీయబడింది.[2] భక్తులు దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి, తమ కోరికలు నేరవేరాలని ఒక దారం కడుతారు. దేవాలయంలోని పురాతన విగ్రహం స్థానిక పూజారి పండిట్ మంగళ్ భట్ కలలో కనిపించిందని చరిత్రకారుల అభిప్రాయం. ఈ దేవాలయాన్ని ఇప్పటికీ భట్ కుటుంబం నిర్వహిస్తోంది.[2]
చిన్న గుడి నుంచి ఆధునిక దేవాలయం వరకు ఏళ్లుగా ఇది అభివృద్ధి చెందింది. దేవాలయానికి విరాళాల రూపంలో డబ్బు, బంగారం, వజ్రాలు, ఇతర విలువైన ఆభరణాలు అందుతాయి.[3] గర్భగృహ ద్వారం, బయటి, పై గోడలు వెండితో తయారు చేయబడ్డాయి. వాటిపై వివిధ పండుగల చిత్రాలు చెక్కబడ్డాయి. ఇండోర్‌కు చెందిన ఒక వ్యాపారవేత్త దానం చేసిన వజ్రాలతో దేవత కళ్ళు తయారు చేయబడ్డాయి.[4]