ఖమస్ రాగం

ఖమస్
ఆరోహణస మ1 గ3 మ1 ప ద2 ని2 స'
అవరోహణస' ని2 ద2 ప మ1 గ3 రి2 స
కర్ణాటక సంగీతం
విషయాలు

శృతిస్వరంరాగంతాళంమేళకర్త

కూర్పులు

వర్ణంకృతిగీతంస్వరజతిరాగం తానం పల్లవితిల్లానా

వాయిద్యాలు

వీణతంబురమృదంగంఘటంమోర్‌సింగ్కంజీరవయోలిన్

సంగీతకారులు

కర్నాటక సంగీతకారుల జాబితా

ఖమస్ లేదా కమాస్/ఖమాస్/ఖమాజ్/ఖమాచ్ దక్షిణ భారత శాస్త్రీయ సంగీతంలో ఒక రాగం. ఇది ఒక జన్య రాగం. 28వ మేళకర్త రాగమైన హరికాంభోజి నుండి ఈ రాగం జనితం. ఈ రాగం శృంగార రసాన్ని పుట్టిస్తుంది. ఈ రాగం జావళీలు పాడేందుకు అనువైన రాగం.[1][2]

రాగ స్వరూపం, లక్షణం

[మార్చు]

ఖమస్ రాగం అసమమిత రాగం, ఆరోహణంలో రిషభం ఉండదు. ఇది ఒక వక్ర షడవ సంపూర్ణ రాగం, అనగా ఆరోహణలోని ఆరు స్వరాలను వంకర-టింకరగా పాడతారు.[2] ఈ రాగం ఆరోహణ, అవరోహణాలు :

ఈ ఆరోహణావరోహణాల్లో స్వరాలు : షడ్జమం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుఃశృతి దైవతం, కైశికి నిషాదం ఆరోహణలో, అవరోహణలో అదనంగా చతుఃశృతి రిషభంస్వరం ఉంటుంది.

హరికాంభోజి, ఖమస్ రాగం ఈ రాగం నుండి జనితం

రాగ వైవిధ్యత

[మార్చు]

నిజానికి ఖమాస్ రాగం ఒక ఉపాంగ రాగం (జనక రాగంలోని స్వరాలనే వాడాలి). తరువాతి కాలంలో జావళీలకు అనువుగా ఖమాస్ భాషాంగ రాగం అయింది (జనక రాఅగంలో లేని స్వరాలు చేరతాయి). అన్య స్వరంగా కైకలి నిషాదాన్ని చేర్చారు.[1] ముద్దుస్వామి దీక్షితుల ప్రకారం ఖమాస్ ఒక సంపూర్ణ రాగం, ఇందులో స్వరాలలో వక్రత ఉండదు.[1][2] హిందుస్తానీ సంగీతంలోని ఖమాజ్ రాగానికి ఖమాస్ రాగం దగ్గరగా ఉంటుంది. హిందీ సినిమా అభిమాన్ లోని 'తేరే మేరే మిలన్ కీ' పాట ఖమాజ్ రాగంలో స్వర పరచబడింది.[3]

పేరు పొందిన పాటలు

[మార్చు]

ఈ రాగంలో ఎన్నో రచనలు స్వరపరచబడ్డాయి. వీటిలో ముఖ్యమైనవి :

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 రాగాస్ ఇన్ కార్నాటిక్ మ్యూజిక్ రచయిత : డా. ఎస్. భాగ్యలక్ష్మి, 1990, సిబిహెచ్ ప్రచురణలు
  2. 2.0 2.1 2.2 రాగనిధి(ఆంగ్ల పుస్తకం) రచయిత : పి. సుబ్బారావు, 1964 ప్రచురణ, మ్యూజిక్ అకాడెమీ ఆఫ్ మద్రాస్
  3. ఖమస్ రాగానికి హిందుస్తానీ సంగీతంలో ఉన్న సమానాంతర రాగాల గురించి హిందూ పత్రికలో కథనం
  4. యూట్యూబ్ లో ఈ రాగాన్ని ఆలపించిన మాళవిక