Total population | |
---|---|
433,722 (2011) | |
ముఖ్యమైన జనాభా కలిగిన ప్రాంతాలు | |
భారతదేశం | |
ఒడిశా | 222,844[1] |
జార్ఖండ్ | 196,135[1] |
బీహార్ | 11,569[1] |
మధ్యప్రదేశ్ | 2,429[1] |
భాషలు | |
మతం | |
సంబంధిత జాతి సమూహాలు | |
ఖరియా మధ్య భారతదేశానికి చెందిన ఆస్ట్రోయాసియాటికు గిరిజన జాతి సమూహం.[2] వారు మొదట ఖారియా భాషను మాట్లాడేవారు. వీరు ఆస్ట్రోయాసియాటికు భాషలకు చెందిన ప్రజలు. వారిని హిల్ ఖరియా, డెల్కి ఖరియా, దూధ్ ఖరియా అని మూడు సమూహాలుగా విభజించారు. వారిలో ఒకరైన దూధ్ ఖరియా భారతదేశంలో అత్యంత అభివృద్ధి చెందిన, విద్యావంతులైన జాతి సమాజాలలో ఒకటిగా గుర్తించబడుతుంది.[3]
భాషా శాస్త్రవేత్త పాల్ సిడ్వెలు అభిప్రాయం ఆధారంగా 4000-3500 సంవత్సరాల క్రితం ఆగ్నేయాసియా నుండి ముండా భాషలు ఒరిస్సా తీరానికి వచ్చాయి.[4] ఆస్ట్రోయాసియాటికు భాషావాడుకరులు ఆగ్నేయాసియా నుండి ఇక్కడకు వ్యాపించింది. స్థానిక భారతీయ జనాభాతో విస్తృతంగా కలిసింది.[5]
ఖరియాలో మూడు తెగలు ఉన్నాయి. దుధ్ ఖరియా, ధెల్కి ఖరియా, హిల్ ఖరియా. మొదటి ఇద్దరు ఖారియా అనే ఆస్ట్రోయాసియాటికు భాష మాట్లాడతారు. కాని హిల్ ఖరియా ఇండో-ఆర్యన్ భాష అయిన ఖరియా థారుకు మారిపోయింది. ఖరియా థారు కోసం భాషా అభివృద్ధి ప్రయత్నాలు జరగలేదు.[2]
దుధ్ ఖరియా, ధెల్కి ఖరియా కలిసి ఒక సమైఖ్య తెగను ఏర్పాటు చేశాయి. ఈ ఖరియా ప్రజలను అహిరు అధిపతి మీద దాడి చేసి ఆపై చోటా నాగ్పూరు పీఠభూమికి తరలివెళ్ళారు.[6]
ఒరిస్సాలో హిల్ ఖరియా ప్రధానంగా ప్రజలు మయూరభంజు జిల్లాలోని జాషిపూరు, కరంజియా బ్లాకులు అధికంగా కనిపిస్తారు. అదనంగా మొరాడా బ్లాకులో కొన్ని గ్రామాలు కూడా ఉన్నాయి. జార్ఖండులో తూర్పు సింగుభూం, గుమ్లా, సిందేగా జిల్లాల్లో వీరు కేంద్రీకృతమై ఉన్నారు. ఈ జిల్లాలో విస్తృతంగా కనిపించినప్పటికీ ముసాబని, డుమారియా, చాకులియా బ్లాక్సు వారు పెద్ద సంఖ్యలో నివస్తారు. పశ్చిమ బెంగాలులో, వారు పశ్చిమ మిడ్నాపూరు, బంకురా, పురులియా జిల్లాలలో ఉన్నారు. అత్యధికంగా పురులియాలో ఉన్నారు.[7]
కొండ ఖరియాను పహారీ ("కొండ" అని అర్ధం) ఖారియా, సవారా (సబరు), ఖేరియా, ఎరేంగా, లేదా పహారు అని కూడా పిలుస్తారు. [ఆధారం చూపాలి] ఇతరత్రా బయటి వ్యక్తులు వారిని ఖరియా అని పిలుస్తారు. కాని వారు తమను సబరు అని పేర్కొంటరు. వారు అడవి మధ్యలో నివసిస్తున్నారు. అటవీ ఉత్పత్తి మీద ఆధారపడటం వలన వారిని "పహారీ (కొండ) ఖరియా" అని పిలుస్తారు.[8]
కొండ ఖరియాలో గొల్గో, భూనియా, శాండి, గిడి, డెహూరి, పిచ్రియా, నాగో, టోలాంగు, సుయా, ధారు, తేసా, కోటలు, ఖార్మోయి, దిగరు, లాహా, సద్దారు, సికారి, రాయి, డుంగ్డంగు వంటి అనేక గోత్రాలు (వంశాలు) ఉన్నాయి. బిలుంగు, కిరో, కెర్కెటా, సోరెంగు, కులు, బా, టేటు, డోలై, సాలు, అల్కోసి, ఖిలాడి. గొల్గో ప్రబలంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి గ్రామంలో వారి వంశాలు అడిగినప్పుడల్లా ఆ వంశం మొదట ఉచ్చరించబడుతుంది.[ఆధారం చూపాలి]
వారు ప్రధానంగా బీహారు, మధ్యప్రదేశు, ఒరిస్సా, పశ్చిమ బెంగాలు, మహారాష్ట్రలలో, త్రిపురలో నివసిస్తున్నారు.[9] అస్సాం, అండమాను దీవులలో కొన్ని కుటుంబాలు కనిపిస్తాయి.[10] 1981 జనాభా లెక్కల ఆధారంగా బీహారులో వారి జనాభా 1,41,771, ఒడిశాలో ఇది 144,178, మధ్యప్రదేశ్‌లో 6892.[11]
బ్రిటిషు పాలనలో వారు జమీందారులుగా ఉన్నారు. ఇప్పుడు స్వతంత్ర భారతదేశంలో భూమిని కలిగి ఉన్న రైతులుగా ఉన్నారు. అన్ని ఖరియా వారి సాంప్రదాయ మాండలికాన్ని మాట్లాడుతుంది. వారు మాట్లాడే భాష ఆండ్రోసియాటికు భాషలలో భాగమైన ముండా భాషలలో ఒక భాగం వారికి వాడుకభాషగా ఉంది. వారు తెగ స్వభావానికి చాలా దగ్గరగా ఉన్నారు. వారి సంస్కృతి దాని పొరుగు సంస్కృతులు, పర్యావరణంతో ప్రభావితమవుతుంది.[2]
కొండ ఖరియా వారి సాంప్రదాయ దుస్తుల నమూనాను సంరక్షించింది. మిగిలిన ఖరియా ప్రజలను ఆధునిక సంప్రదాయ పరిచయాలు ప్రభావితం చేసారు. వారి వస్త్రధారణ శైలిని మార్చింది. సాంప్రదాయకంగా వారు భగవాను అని పిలువబడే ధోతిని ధరిస్తారు. మహిళలు చీలమండల వరకు పడే చీర ధరిస్తారు. చీరలో ఒక భాగం వారి చాతిభాగాన్ని కప్పివేస్తుంది. సాంప్రదాయ దుస్తులు ఈ రోజులలో వాడుకలో లేవు. పురుషులు, మహిళలు ఇద్దరూ సాధారణంగా ఇత్తడి, నికెలు, అల్యూమినియం, వెండి, అరుదుగా బంగారంతో చేసిన ఆభరణాలను ధరిస్తారు. దుధ్ ఖరియా మహిళలు బంగారు ఆభరణాలను ఇష్టపడతారు.[12]
ఖరియా మధ్య సెక్షనలు ప్రాతిపదికన వివిధ స్థాయిల ఆర్థిక పరిణామాలు ఉన్నాయి. కొండ ఖరియా ఆహార సేకరణ, వేట, కార్మికుల సంఘం ఆధారిత ఆర్ధిక విధానం అనుసరిస్తున్నారు. ధెల్కిలు వ్యవసాయ కూలీలు, వ్యవసాయదారులు, దుధ్ ఖరియా ప్రాధమిక ఆర్థిక వ్యవస్థ వ్యవసాయం.[13]
ఖరియా ప్రజలు కుటీర పరిశ్రమలలో నైపుణ్యం కలిగి ఉన్నారు.[14]
ఖరీయా గొప్ప నృత్యకారులుగా పసిద్ధిచెందారు. యువతీ యువకులు కలిసి నృత్యం చేస్తారు. కొన్నిసార్లు వారు మగ, ఆడవారిలో రెండు సమూహాలను ఏర్పరుస్తారు. ఒకదాని తరువాత ఒకటి పాడతారు. ఇది పాట రూపంలో బాలురు, బాలికల మధ్య మార్పిడి జరుగుతోంది. [15] ఈ క్రింది నృత్య నమూనాలు ఖరీయాలు- హరియో, కిన్భారు, హల్కా, కుడింగు, జాధురాలలో ప్రబలంగా ఉన్నాయి.[16]
<ref>
ట్యాగు; census
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదుthe (Dudh) Kharia are also one of the most highly educated ethnic groups in all of India, with some estimates as to their rate of literacy running as high as 90%.
{{cite book}}
: CS1 maint: others (link)