ఖలీద్ వజీర్

ఖలీద్ వజీర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
సయ్యద్ ఖలీద్ వజీర్
పుట్టిన తేదీ(1936-04-27)1936 ఏప్రిల్ 27
జుల్లుందూర్, పంజాబ్, బ్రిటిష్ ఇండియా
మరణించిన తేదీ2020 జూన్ 27(2020-06-27) (వయసు 84)
చెస్టర్, ఇంగ్లాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్ మీడియం
పాత్రబ్యాట్స్‌మన్
బంధువులు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 16)1954 జూన్ 10 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు1954 జూలై 22 - ఇంగ్లాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు First-class
మ్యాచ్‌లు 2 18
చేసిన పరుగులు 14 271
బ్యాటింగు సగటు 7.00 15.05
100లు/50లు 0/0 0/1
అత్యధిక స్కోరు 9* 53
వేసిన బంతులు 1,530
వికెట్లు 14
బౌలింగు సగటు 53.28
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 3/82
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 11/–
మూలం: CricInfo, 2023 మే 23

సయ్యద్ ఖలీద్ వజీర్ (1936, ఏప్రిల్ 27 – 2020, జూన్ 27) పాకిస్తానీ మాజీ క్రికెటర్.[1][2] 1954లో రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. వజీర్ అలీ సమ్మర్ లీగ్ అతని పేరు పెట్టారు.[3]

జీవిత విశేషాలు

[మార్చు]

వజీర్ 1936, ఏప్రిల్ 27న పంజాబ్‌లోని జుల్లుందూర్‌లో జన్మించాడు. ఇతని తండ్రి వజీర్ అలీ 1930లలో భారతదేశం తరపున టెస్ట్ క్రికెట్ ఆడాడు.[4] 1947లో విభజన తర్వాత అతని కుటుంబం కరాచీకి మారింది.[3] ఇతను కరాచీలోని సెయింట్ పాట్రిక్స్ హైస్కూల్‌లో చదువుకున్నాడు.[5][6] తన పాఠశాల రోజుల్లో, అతను రూబీ షీల్డ్ ఇంటర్-స్కూల్ క్రికెట్ టోర్నమెంట్‌లో ఆడాడు.[3]

క్రికెట్ రంగం

[మార్చు]

1954లో ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికయ్యాడు. ఇతని మామ సయ్యద్ నజీర్ అలీ జట్టు సెలెక్టర్‌లో ఒకరిగా ఉన్నాడు.[3] ఇతను కేవలం రెండు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల తర్వాత ఎంపికయ్యాడు. 18 పరుగులు చేసి 5 వికెట్లు తీసుకున్నాడు. పర్యటనలో 16 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల్లో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా 16.86 సగటుతో 253 పరుగులు చేశాడు. 54.90 సగటుతో 9 వికెట్లు తీసుకున్నాడు.[7] మొదటి, మూడవ టెస్టులలో ఆడాడు. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేశాడు. బౌలింగ్ చేయలేదు. టూర్ తర్వాత ఇక ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడలేదు.[8]19 ఏళ్ళు నిండకముందే ఫస్ట్-క్లాస్ కెరీర్ ముగిసిన ఏకైక టెస్ట్ క్రికెటర్ గా నిలిచాడు.[5]

1957లో లాంక్షైర్ లీగ్‌లో ఈస్ట్ లంకాషైర్ తరపున ప్రొఫెషనల్‌గా ఒక మ్యాచ్ ఆడాడు. 57 పరుగులకు 5 వికెట్లు తీసుకున్నాడు.[9]

మూలాలు

[మార్చు]
  1. "Khalid Wazir". www.cricketarchive.com. Retrieved 2023-09-13.
  2. "Former Pakistan cricketer Khalid Wazir dies at 84". ESPN Cricinfo. Retrieved 2023-09-13.
  3. 3.0 3.1 3.2 3.3 July 2020, Salim Parvez Thursday 2. "Khalid Wazir - An Obituary". Cricket World.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  4. "Cricketing Dynasties: The Twenty Two Families of Pakistan Test Cricket – Part 4 | Sports | thenews.com.pk". www.thenews.com.pk.
  5. 5.0 5.1 Ahmed, Qamar (30 June 2020). "Test cricketer Khalid Wazir passes away". DAWN.COM.
  6. "Notable Alumni – St. Patrick's High School". Archived from the original on 2021-03-03. Retrieved 2023-09-13.
  7. Wisden Cricketers' Almanack 1955, p. 220.
  8. Booth, Lawrence (2021). Wisden Cricketers' Almanack. p. 261. ISBN 9781472975478.
  9. "Lancashire Cricket League". lancashireleague.com.

బాహ్య లింకులు

[మార్చు]