ఖేచరీ ముద్ర అనేది, ఒక హఠయోగ సాధన. ఇందులో నాలుక కొసను వెనక్కి మడిచి, కొండనాలుకపై భాగం మీదుగా నాసికా రంధ్రాలను తాకించడం. దీన్ని సాధన చేయాలంటే ముందుగా నాలుకను పొడవుగా చేయాలి. ఇందుకోసం నోరు కింది భాగం నుంచి నాలుకను అంటి పెట్టుకునే మృదు కండరాలను నెమ్మదిగా కత్తిరించుకుంటూ పోతారు కూడా.ఈ ఖేచరీ ముద్రను స్వామీ దయానందగిరి తనచివరి రోజులలో ఆచరించి జీవితాన్ని పరిత్వజించాడు
యోగ సాధనలో ఐదు విధాలైన ముద్రలు ఉన్నాయి. అందులో ఒకటి ఖేచరీ ముద్ర. మిగిలినవి: 2. భూచరి, 3. మధ్యమ, 4. షణ్ముఖి, 5. శాంభవి. ఇందులో ఖేచరీ ముద్రలో ముఖ్యాంశం భ్రూమధ్యంలో చూపును కేంద్రీకరించి ఉంచడం. ఇది లంబికా యోగానికి సంబంధించిన ముద్ర కూడా. నాలుక అగ్ర భాగాన్ని వెనుకకు మరల్చి కొండనాలుకకు తాకించడం లంబికాయోగం. ఇందుకు గాను సాధకులు నాలుక కింద నెమ్మదిగా కోత పెడతారు. ఇది చాలా కష్టంతో కూడిన పని. గురుముఖంగా మాత్రమే చేయదగిన సాధన. యోగ కుండల, శాండిల్య గ్రంథాలలో ఇందుకు సంబంధించిన సాధనను వివరించారని ఆం.వే.ప. తెలియ జేస్తుంది.
Lal Ghosh, Sananda (1980), Mejda: The Family and the Early Life of Paramahansa Yogananda, Self-Realization Fellowship Publishers, ISBN978-0-87612-265-5
Mallinson, James (2007), The Khecarīvidyā of Adinathā, Routledge, ISBN978-0-415-39115-3
Muller-Ortega, Paul E. (2001), "A Poem by Abhinava Gupta", in White, David Gordon (ed.), Tantra in Practice, Motilal Banarsidass, p. 580, ISBN978-81-208-1778-4