గద్దలకొండ గణేష్ | |
---|---|
దర్శకత్వం | హరీష్ శంకర్ |
రచన | హరీష్ శంకర్ (డైలాగ్స్) |
దీనిపై ఆధారితం | తమిళ సినిమా జిగార్తండ ఆధారంగా |
నిర్మాత | రామ్ ఆచంట గోపి ఆచంట |
తారాగణం | వరుణ్ తేజ్ అథర్వ మురళీ పూజా హెగ్డే మృణాళిని రవి |
ఛాయాగ్రహణం | ఆయనంక బోస్ |
కూర్పు | ఛోటా కె. నాయుడు |
సంగీతం | మిక్కీ జే మేయర్ |
నిర్మాణ సంస్థ | 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ |
విడుదల తేదీ | 20 సెప్టెంబరు 2019 |
సినిమా నిడివి | 172 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | ₹25 కోట్లు [1] |
బాక్సాఫీసు | మూస:అంచనా ₹42.5 కోట్లు [2][3] |
గద్దలకొండ గణేష్ 2019 సెప్టెంబరు 20లో విడుదలైన తెలుగు సినిమా. తమిళంలో హిట్టయిన "జిగార్తండ" సినిమాను తెలుగులో రీమేక్ చేశారు. 14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి మొదట ‘వాల్మీకి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అయితే ఓ వర్గానికి చెందిన కొందరు ఈ టైటిల్‌పై కోర్టును ఆశ్రయించగా.. తప్పని పరిస్థితులలో దర్శక, నిర్మాతలు టైటిల్‌ను ‘గద్దలకొండ గణేష్’గా మార్చారు.[4]
చిన్నతనం నుంచి సినిమాలపై ఉన్న మక్కువతో ఏదో ఒక రోజు డైరెక్టర్ అవుతానని అనుకుంటూ.. ప్రయత్నాలు సాగిస్తుంటాడు అభిలాష్(అథర్వ మురళి[5]). అభిలాష్ సంవత్సరంలోపు సినిమా తీస్తానని ఓ సీనియర్ దర్శకుడితో శపథం చేస్తాడు. తన సినిమాలో గ్యాంగ్ స్టర్ నేపథ్యమున్న విలన్ని.. హీరోగా చూపించాలనుకుంటాడు. అందులో భాగంగానే ఆంధ్ర, తెలంగాణ బార్డర్లో ఉన్న గద్దలకొండ గ్రామంలో విలనిజం చేసే గద్దలకొండ గణేష్(వరుణ్ తేజ్)ని ఎంచుకుని అతని ప్రతీ చర్యను గమనిస్తూ...అతని గురించిన విషయాలు ఆరాతీస్తూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో అభిలాష్.. గణేష్ దృష్టిలో పడతాడు. అయితే గణేష్‌కి ఈ విషయమంతా తెలిసి.. తన గురించి కాదు.. తననే హీరోగా సినిమా తీయాలని అభిలాష్‌ను బెదిరిస్తాడు. మరి అభిలాష్ గద్దలకొండ గణేష్‌తో సినిమా తీశాడా.? అతను చివరికి డైరెక్టర్ అయ్యాడా.? అనేదే సినిమా కథ.[6][7]
{{cite news}}
: CS1 maint: bot: original URL status unknown (link)