గబ్బర్ సింగ్

గబ్బర్ సింగ్
(2012 తెలుగు సినిమా)
దర్శకత్వం హరీష్ శంకర్
నిర్మాణం బండ్ల గణేష్
చిత్రానువాదం హరీష్ శంకర్
తారాగణం పవన్ కళ్యాణ్,
ఆలీ (నటుడు)
శ్రుతి హాసన్ ,
గాయత్రీరావు,
రావు రమేష్,
సుహాసిని,
అజయ్
ఫిష్ వెంకట్
బలిరెడ్డి పృధ్వీరాజ్
సంగీతం దేవి శ్రీ ప్రసాద్
నిర్మాణ సంస్థ శ్రీ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

గబ్బర్ సింగ్ 2012లో విడుదలైన తెలుగు చిత్రం. ఈ సినిమాని బండ్ల గణేష్ శ్రీ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకం పై నిర్మించారు. ప్రముఖ హిందీ నటుడు సల్మాన్ ఖాన్ సంచలనాత్మక విజయం సాధించిన "దబాంగ్" సినిమా యొక్క పునఃనిర్మాణమగు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, శృతి హాసన్ జంటగా నటించగా హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు.[1] ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. 2012 మే 11న విడుదలైన ఈ సినిమా[2] విమర్శకుల మరియూ ప్రేక్షకుల ఆదరణ పొందడమే కాక 63 కోట్ల రూపాయల వసూళ్ళు సాధించి తెలుగు సినిమా స్థాయిని పెంచింది.[3]

వెంకట రత్నం నాయుడు అలియాస్ గబ్బర్ సింగ్ (పవన్ కళ్యాణ్) సుహాసిని కొడుకు. సుహాసిని నాగినీడుని రెండవ పెళ్ళి చేసుకుంటుంది. వెంకట రత్నం నాయుడు “షోలే” చిత్రం నుండి గబ్బర్ సింగ్ పాత్రను చాలా ఇష్టపడతాడు తనని తాను “గబ్బర్ సింగ్” అని పిలవాలని నిర్ణయించుకుంటాడు. అతను పెరిగి పెద్దయ్యి డేరింగ్ అండ్ డాషింగ్ పోలిస్ అవుతాడు. తన సొంతూరయిన కొండవీడులోనే పోలిస్ గా నియమితమవుతాడు. న్యాయన్ని కాపాడే విధానంలో అతనికి సిద్దప్ప నాయుడు (అభిమన్యు సింగ్)తో గొడవ మొదలవుతుంది. సిద్దప్ప నాయుడు రాజకీయ పలుకుబడి ఉన్న ప్రాంతీయ గూండ.

సిద్దప్ప నాయుడుతో గొడవలతో పాటు భాగ్య లక్ష్మి (శృతి హాసన్)తో ప్రేమలో పడతాడు గబ్బర్ సింగ్. పరిస్థితులు ఇలా సాగుతుండగా చిత్రంలో ఈర్ష్య,ద్వేషం అనే భావాలూ ప్రవేశిస్తాయి. సిద్దప్ప చేసే చట్ట వ్యతిరేకమయిన పనులను గబ్బర్ సింగ్ ఆపగలిగాడా? తను అనుకున్నది సాదించడానికి గబ్బర్ సింగ్ ఏం కోల్పోవాల్సి వచ్చింది అనేది మిగిలిన కథ.

సంభాషణలు

[మార్చు]
  • అరే కోటీ ఇంకో టీ......
  • నాక్కొంచెం తిక్కుంది, కానీ దానికో లెక్కుంది
  • నా తిక్కేంటో చూపిస్తా, అందరి లెక్కలూ తేలుస్తా
  • నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ
  • అరే వో గబ్బర్ సింగ్ కే ఫౌజియో!
  • ఒరేయ్ సాంబా, రాస్కో రా!
  • నేను ట్రెండ్ ఫాలో అవను, సెట్ చేస్తా...
  • పాటలు పాడమంటే ప్యాథోస్ పాడతార్రా? ఎనర్జీ ఏది రా, జోష్ ఏది రా?
  • ఎప్పుడైనా తాగితే సంతోషం, అప్పుడప్పుడూ తాగితే వ్యసనం, రోజూ తాగితే రోగం.
  • మీరు ఆరోగ్యంగా ఉండాలన్నా, మేం ఆనందంగా ఉండాలన్నా మీరు మాతోనే వుండాలి

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • పాటలు మరియూ నేపథ్య సంగీతం - దేవి శ్రీ ప్రసాద్
  • ఛాయాగ్రహణం - జయనన్ విన్సెంట్
  • కళ - కడలి బ్రహ్మ
  • కూర్పు - గౌతంరాజు
  • చిత్రానువాదం - రమేశ్ రెడ్డి, వేగ్నేశ సతీష్, హరీష్ శంకర్
  • మాటలు & దర్శకత్వం - హరీష్ శంకర్
  • నిర్మాత - బండ్ల గణేష్

పాటలు

[మార్చు]

దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. జల్సా తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాకి సంగీతం అందించడం దేవి శ్రీకి ఇది రెండో సారి. ఆదిత్య మ్యూజిక్ లేబెల్ ద్వారా శిల్పకళా వేదికలో ఈ సిన్మా పాటలను 2012 ఏప్రిల్ 15న విడుదల చేసారు. ఈ సినిమా పాటలు నేటికీ ప్రజలచే విశేషంగా ఆదరించబడుతున్నాయి.

పాట గానం రచన నిడివి
దేఖో దేఖో గబ్బర్ సింగ్ బాబా సెహ్గల్, నవీన్ మాధవ్ రామజోగయ్య శాస్త్రి 4:21
ఆకాశం అమ్మాయైతే శంకర్ మహదేవన్, గోపికా పూర్ణిమ చంద్రబోస్ 4:53
మందు బాబులం మేము కోట శ్రీనివాసరావు, దేవి శ్రీ ప్రసాద్ సాహితి 1:35
పిల్లా వడ్డేపల్లి శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ దేవి శ్రీ ప్రసాద్ 3:49
దిల్ సే కార్తిక్, శ్వేతా మోహన్ భాస్కరభట్ల రవికుమార్ 4:23
కెవ్వు కేక మమతా శర్మ, మురళి సాహితి 4:07

విశేషాలు

[మార్చు]
  • చాలా కాలం తర్వాత తెలుగు సినిమా కథానాయిక పాశ్చాత్య దుస్తుల జోలికి పోకుండా పూర్తి నిడివి అచ్చ తెలుగు దుస్తులని (కేవలం లంగా ఓణిలు, చీర లు) ధరించింది.

పురస్కారాలు

[మార్చు]

సైమా అవార్డులు

[మార్చు]

2012 సైమా అవార్డులు (తెలుగు)

  1. ఉత్తమ దర్శకుడు
  2. ఉత్తమ నటుడు
  3. ఉత్తమ నటి
  4. ఉత్తమ సంగీత దర్శకుడు
  5. ఉత్తమ హాస్యనటుడు (ప్రభాస్ శ్రీను)

మూలాలు

[మార్చు]
  1. "Friday Release: Dabangg's Telugu remake Gabbar Singh". ibnlive.in.com. Archived from the original on 14 మే 2012. Retrieved 10 May 2012.
  2. "Pawan Kalyan's Gabbar Singh grand release". Way2movies. Archived from the original on 12 మార్చి 2015. Retrieved 12 October 2012.
  3. "Gabbar Singh emerges as highest grosser at Box Office". India Today. Retrieved 19 July 2012.