గయానా (Guyana) (పాతపేరు బ్రిటిష్ గయానా) దక్షిణ అమెరికా లోని ఉత్తర తీరంలో గల దేశం. ఈ దేశపు జనాభాలో 24.8% మంది హిందూ మతస్థులు. [1] పశ్చిమార్ధగోళం లోని దేశాల్లో కెల్లా దేశ జనాభాలో అత్యధిక శాతం హిందూవులున్నది గయానా లోనే. [2]
బ్రిటిషు సామ్రాజ్యంలో 1833 బానిసత్వ నిర్మూలన చట్టం తరువాత, కార్మికుల అవసరం ఏర్పడడంతో, గయానా లోను ఇతర బ్రిటిష్ వెస్ట్ ఇండియన్ భూభాగాలలోనూ భారతీయుల నియామకానికి దారితీసింది. కొత్త కార్మికులు ఇక్కడికి వచ్చిన తర్వాత, కొత్త ఒప్పందాలు, పని పరిస్థితులతో పాటు తీవ్ర ఉష్ణమండల పరిస్థితులకు అనుగుణంగా మారవలసి వచ్చింది. 1835 - 1918 మధ్య, 3,41,600 మంది ఒప్పంద కార్మికులను భారతదేశం నుండి బ్రిటిష్ గయానాలోకి దిగుమతి చేసుకున్నారు. [3]
1852 నుండి, క్రైస్తవ మిషనరీలు ఒప్పంద సమయంలో తూర్పు భారతీయులను మతం మార్చడానికి ప్రయత్నించారు. అయితే ఇది చాలా తక్కువ విజయాన్ని సాధించింది. క్రైస్తవ మిషనరీలు మతమార్పిడి చేయడం ప్రారంభించినప్పుడు, బ్రాహ్మణులు కులాలతో సంబంధం లేకుండా హిందువులందరికీ ఆధ్యాత్మిక ఆచారాలను నిర్వహించడం ప్రారంభించారు. ఇది అక్కడ కుల వ్యవస్థ విచ్ఛిన్నానికి దారితీసింది.
1940ల చివరలో, సంస్కరణ ఉద్యమాలు చాలా మంది గయానీస్ హిందువుల దృష్టిని ఆకర్షించాయి. 1910లో ఆర్యసమాజ్ గయానాకు చేరుకుంది. సమాజ్ సిద్ధాంతం కులం ఆలోచనను, మత నాయకులుగా బ్రాహ్మణుల ప్రత్యేక పాత్రనూ తిరస్కరిస్తుంది. ఈ ఉద్యమం ఏకేశ్వరోపాసనను బోధిస్తూ, అనేక సాంప్రదాయ హిందూ ఆచారాలతోపాటు పూజలలో చిత్రాలను ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తుంది. 1930ల తరువాత, హిందూమత స్థితి మెరుగుపడడం, హిందువులపై వివక్ష తగ్గడం మొదలైన కారణాల వలన క్రైస్తవ మతంలోకి హిందువుల మతమార్పిడులు మందగించాయి.
ఎన్నో దశాబ్దాలుగా గయానాలో హిందూమతం క్షీణిస్తూ వస్తోంది. 1991లో, గయానీస్ జనాభాలో 35.0% మంది హిందూమతస్థులు ఉన్నారు. 2002లో ఈ సంఖ్య 28.4%కి, [4] 2012లో 24.8%కీ తగ్గింది [1]
సంవత్సరం | శాతం | మార్పు |
---|---|---|
1980 | 35.7% | - |
1991 | 35.0% | -0.7% |
2002 | 28.4% | -6.6% |
2012 | 24.8% | -3.6% |
ప్రాంతం | హిందువుల శాతం (2002) | హిందువుల శాతం (2012) |
---|---|---|
రిమా-వైని | 8.1% | ![]() |
పోమెరూన్-సుపేనామ్ | 37.3% | ![]() |
ఎస్సెక్విబో దీవులు-వెస్ట్ డెమెరారా | 46.5% | ![]() |
డెమెరారా-మహైకా | 24.4% | ![]() |
మహికా-బెర్బిస్ | 39.0% | ![]() |
తూర్పు బెర్బిస్-కోరెంటైన్ | 46.4% | ![]() |
కుయుని-మజరుని | 5.6% | ![]() |
పొటారో-సిపారుని | 6.4% | ![]() |
ఎగువ టకుటు-అప్పర్ ఎస్సెక్విబో | 0.5% | ![]() |
ఎగువ డెమెరారా-బెర్బిస్ | 4.7% | ![]() |
Guyana | 28.4% | ![]() |
తూర్పు బెర్బిస్-కోరెంటైన్ ప్రాంతంలో తమిళ హిందువులు మెజారిటీగా ఉన్నారు. [5]
గయానా జనాభాలో 39.8% మంది తూర్పు భారతీయులే అయినప్పటికీ, కేవలం 24.8% మంది మాత్రమే హిందువులు. [1] మిగిలినవారు ఎక్కువగా ముస్లింలు (6.8%) లేదా క్రైస్తవులు.
హోలీ - ఫగ్వా, దీపావళి గయానాలో జాతీయ సెలవులు. [6]
<ref>
ట్యాగు; "state.gov" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు