గవర్నమెంట్ మ్యూజియం 1851 సంవత్సరం చెన్నైలోని ఎగ్మోర్ ప్రాంతంలో స్థాపించబడింది. భారతదేశంలోని చారిత్రక పురాతన మ్యూజియాలలో రెండవది ఈ మద్రాస్ మ్యూజియం. భారతదేశంలోని చారిత్రక మ్యూజియాలలో మొదటిది కోలకతా లో ఉంది, దీనిని 1814 సంవత్సరంలో స్థాపించారు. దక్షిణ ఆసియాలోని అతిపెద్ద మ్యూజియములలో ఒకటిగా ఈ చెన్నపట్టణం మ్యూజియం ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా ఇందులో ప్రాధాన్యత కలిగిన పురావస్తు, నాణేల సేకరణలు ఉంటాయి. రోమన్ ప్రాచీనకాలం నాటి ప్రాముఖ్యత గల అతిపెద్ద పురాతన వస్తువులను సేకరించారు. వంద సంవత్సరాల పైబడిన అనేక చారిత్రక భవనాలు ఈ ప్రభుత్వ సంగ్రహాలయం ప్రాంగణంలో ఉన్నాయి. ఈ మ్యూజియం ప్రాంగణంలోనే అందరిని బాగా ఆకట్టుకునే వైజ్ఞానిక థియేటర్ ఉంది. ఈ మ్యూజియం పరిసర ప్రాంతంలోనే ప్రస్తుతం నేషనల్ ఆర్ట్ గ్యాలరీ ఉన్నది. దీనిని ఇండో సార్సెనిక్ శైలిలో నిర్మించారు. ఈ భవనం నందు రాజా రవి వర్మ వంటి వారు తయారు చేసిన అరుదైన కళాఖండాలు ఉన్నాయి.
ఈ మ్యూజియం ప్రాంగణంలోని ఒక భవనంలో చనిపోయిన అన్ని జంతువుల శరీరాలను ఇక్కడ భద్ర పరిచారు. ఇక్కడ అన్ని జీవులకు సంబంధించిన కళేబరాలు ఉండటంతో మాట సామెతగా ఈ మ్యూజియంలో ఏముంటాయి బొచ్చు తప్పక అని ఎవరో అన్నారని అప్పుడు నిర్వాహకులు ఒరోరే మన మ్యూజియంలో బొచ్చు లేదే అని అప్పుడు బొచ్చు కూడా ఏర్పాటు చేసారని పెద్దలు చెప్పుతుంటారు. తెలుగువారు అన్ని రకాల చనిపోయిన జంతువుల శరీరాలను భద్ర పరచిన ఈ మ్యూజియాన్ని చచ్చిన కాలేజి అని మద్రాసులోని మరొక ప్రాంతంలో ఉన్న జూపార్కును బతికిన కాలేజి అని చాలా కాలం పాటు ఉపయోగించారు.