ఘనగాపుర
ಗಾಣಗಾಪುರ శ్రీ క్షేత్రం గాణగాపూర్ | |
---|---|
Village | |
గానుగాపూర్ | |
శ్రీ క్షేత్రం గానుగాపూర్ వద్ద భీమా అమర్జా నదుల సంగమం | |
Nickname: దేవల్ గాణగాపురం | |
Country | ![]() |
రాష్ట్రం | కర్ణాటక |
జిల్లా | గుల్బర్గా |
ప్రభుత్వం | |
• సంస్థ | పంచాయతీ |
జనాభా | |
• మొత్తం | 7,000 |
భాషలు | |
• అధికార | కన్నడం, మరాఠీ |
కాల మండలం | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 585212 |
టెలిఫోన్ కోడ్ | 08470 |
Vehicle registration | KA32 |
Nearest city | అప్జల్ పూర్, గుల్బర్గా |
Lok Sabha constituency | గుల్బర్గా |
Vidhan Sabha constituency | అఫ్జల్‌పురా |
Civic agency | పట్టణ పంచాయతీ |
ఘనగాపుర (కొన్నిసార్లు శ్రీ క్షేత్ర ఘనగాపూర్ పిలుస్తారు) భారతదేశం లోని కర్ణాటక రాష్ట్రములో అప్జల్ పూర్ తాలూకా గుల్బర్గా జిల్లా లో ఉంది. ఈ గ్రామం, గురు దత్తాత్రేయ ఆలయంగా ప్రసిద్ధిచెందింది. గురు దత్తాత్రేయ భీమ నది ఒడ్డున పరిపూర్ణత పొందారని చెబుతారు.
ఘనగాపుర పుణ్య క్షేత్రము లోని శ్రీ నరసింహ సరస్వతి స్వామిని దత్తాత్రేయ రెండవ అవతారం కొలుస్తారు. శ్రీ గురుచరిత్ర పుస్తకం ప్రకారం, అతను ఘనగాపుర వద్ద ఎప్పటికీ నివాసం ఉంటానని వాగ్దానం చేసారు. అతను ఉదయం భీమ, అమర్జా నదుల సంగమం వద్ద స్నానం చేస్తారు. మధ్యాహ్నం సమయంలో, అతను భిక్ష (ఆహారం భిక్ష) కోరుతూ గ్రామం లోకి వెళ్ళి వెళతారు, ఆలయం వద్ద నిర్గుణ పాదుకా రూపంలో పూజలు అందుకొంటారు. భక్తులు సంగమం వద్ద స్నానం ఆచరించి, ఘనగాపుర కనీసం ఐదు గృహాల నుండి భిక్ష యాచించడం ద్వారా, ఆలయం వద్ద పాదుకా పూజా, దర్శనం ద్వారా, వారు శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారి అనుగ్రహం పొందుదురు. దాని ద్వారా పాపముల నుండి విముక్తి పొందుదురు.
లాడ్జింగ్ సౌకర్యాలు (డీలక్స్ రూములు), ఆశ్రమలు, ప్రైవేట్ రూములు ఇప్పుడు శ్రీ క్షేత్ర ఘనగాపూర్ అందుబాటులో ఉన్నాయి. కానీ ముందుగానే వసతి బుక్ చేసుకోంటే ఉత్తమం. ముఖ్యముగా ఆదివారం, గురువారం, పూర్ణిమ, అమావాస్య, పండుగల వంటి రోజుల్లో రూములు పొందడానికి ఆతి కష్టం.
లాడ్జింగ్ సౌకర్యాలు (డీలక్స్ రూములు) గుల్బర్గాలో కలవు, గుల్బర్గా నుండి ఘనగాపురకు బస్ సౌకర్యము ఉంది.
ఘనగాపుర దత్తాత్రేయ ఆలయం వద్ద చేసే పూజలు, సేవలు వివిధ రకాలుగా ఉన్నాయి.
ఘనగాపూర్ కు రోడ్డు, రైలు రవాణా ఉంది. ఘనగాపూర్ కు, గుల్బర్గా నుండి పలు ప్రభుత్వ రంగ బస్సులు ఉన్నాయి. ఘనగాపూర్, గుల్బర్గా-ముంబై మార్గంలో ఉంది. యాత్రికులు ఘనగాపూర్ రోడ్ రైల్వే స్టేషన్ వద్ద దిగాలి. అక్కడ నుండి ఘనగాపూర్ కి బస్సు, ఆటో రిక్షా ద్వారా 22 కిలోమీటర్లు (14 మైళ్ళు) చేరుకోవచ్చు. సమీప విమానాశ్రయం హైదరాబాద్. హైదరాబాద్ నుండి బస్ సౌకర్యము ఉంది.