గాయత్రి విద్యా పరిషత్ ఇంజనీరింగు కళాశాల | |
రకం | స్వయంప్రతిపత్తి |
---|---|
స్థాపితం | 1996 |
అధ్యక్షుడు | డి. వి సుబ్బారావు |
ప్రధానాధ్యాపకుడు | ఎన్.వి.ఎస్.ఎస్.జె గాంధీ |
విద్యాసంబంధ సిబ్బంది | 185 |
నిర్వహణా సిబ్బంది | 111 |
విద్యార్థులు | 2,880 |
అండర్ గ్రాడ్యుయేట్లు | 2,540 |
పోస్టు గ్రాడ్యుయేట్లు | 340 |
స్థానం | విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం |
కాంపస్ | మధురవాడ |
అథ్లెటిక్ మారుపేరు | గాయత్రీ |
అనుబంధాలు | జె.ఎన్.టీ.యూ కాకినాడ |
జాలగూడు | http://gvpce.ac.in http://www.gvpcoeedu.org |
ఈ కళాశాల, 1996 సంవత్సరంలో, విశాఖపట్నంలో స్థాపించబడింది. దీని స్థాపనలోనూ, నిర్వహణలోనూ విశాఖపట్నంలో ఎందరో విద్యావేత్తలు, దాతలు, వృత్తివిద్యా నిపుణులు పాలుపంచుకొంటున్నారు. "సంపూర్ణ విధానం ద్వారా, టెక్నలాజికల్ విద్య, పరిశోధనల్లో, శ్రేష్ఠ విద్యాకేంద్రం ఎదగడం, కొనసాగడం" అనే ఆశయం కలిగి ఉంది.
కళాశాలలోని వివిధ కోర్సులు
ఇది గాయత్రీ విద్యా పరిషత్ మాజీ అధ్యక్షులు, నాగార్జున విశ్వవిద్యాలయపు మాజీ ఉపకులపతి, ఆంధ్ర విశ్వవిద్యాలయపు అర్థశాస్త్ర గౌరవ ఆచార్యులు, నైజీరియా దేశప్రభుత్వపు మాజీ సలహాదారు, ప్రముఖ ఆర్థికవేత్త అయిన బి సర్వేశ్వరరావు పేర ఏర్పరచబడింది. ఇందులో:
విద్యార్థుల సౌకర్యార్థం డిజిటల్ గ్రంథాలయం కూడా ఏర్పాటు చేయబడింది.
విద్యార్థినీ విద్యార్థులకు విడివిడిగా వసతి గృహాలు ఉన్నాయి
సుమారు 6.5 ఎకరాల మేర ఏర్పాటు చేయబడిన ఆట వసతుల్లో ఈ క్రిందివి కూడా ఉన్నాయి.
వీటి సమయం ప్రతీరోజు, ఉదయం 6 -8 గంటల వరకూ, సాయంత్రం 3-30-7 గంటల వరకు.
విశాఖపట్నం నగరశివారులలో గల మధురవాడలో ఇది నెలకొని ఉంది. నగరం నడిబొడ్డు నుండి మధురవాడ 30 నిమిషాల ప్రయాణం. కాంప్లెక్సు నుండి, తగరపువలస పోయే 222 నంబరు బస్సులు, భీమిలి పోయే 999 బస్సులు మధురవాడ వద్ద ఆగుతాయి. పాతపోస్టాఫీసు నుండి, 25 P బస్సులు పి.ఎం పాలెం (పోతిన మల్లయ్య పాలెం) వరకూ వచ్చే బస్సు ప్రతీ 10 నిమిషాలకు ఒకటి ఉంటుంది. మధురవాడ, పీ.ఎం పాలెం లనుండి కళాశాల షేర్ ఆటో ఉంటాయి. కళాశాల పక్కనే ఉన్న బక్కన్నపాలెం గ్రామానికి కూడా 25 K బస్సు వస్తుంది. ఇది ఒకే ఒక్క బస్సు కావడంవలన ఎక్కువ సౌకర్యం ఉండదు. ఇంక, కళాశాల ఏర్పాటు చేసిన బస్సులు ఈ విధంగా ఉంటాయి.
కళాశాల ప్రాంగణంలో కేంటీన్, పోస్టాఫీసు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ ఎక్స్ టెన్షన్ కౌంటరులు కూడా ఉన్నాయి.
2001లో కళాశాల-పరిశ్రమ అనుబంధాన్ని అభివృద్ధిచేసే ఉద్దేశంతో పారిశ్రామిక సలహాపనుల, పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఏర్పరచబడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గాయత్రీ విద్యా పరిషత్, జర్మనీ దేశ ప్రభుత్వం సంయుక్తంగా ఏర్పరచిన ఇండో-జర్మన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ డ్ టెక్నాలజీ, విశాఖపట్నంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
ఇక్కడ, విద్యార్థులకి, చదువు సాగుతూ ఉండగానే ప్రాంగణనియామకాలు వస్తూ ఉంటాయి.