పట్టణం | |
![]() | |
Coordinates: 15°22′42″N 78°55′35″E / 15.3784°N 78.9265°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | గిద్దలూరు మండలం |
విస్తీర్ణం | |
• మొత్తం | 20.94 కి.మీ2 (8.08 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 35,150 |
• సాంద్రత | 1,700/కి.మీ2 (4,300/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 983 |
Area code | +91 ( 08405 ![]() |
పిన్(PIN) | 523357 ![]() |
Website |
గిద్దలూరు ప్రకాశం జిల్లాలోని ఒక పట్టణం, అదే పేరుగల మండలానికి కేంద్రం.
1930వ దశకములో కామ్మియెడ్, బర్కెట్ట్ అను ఇద్దరు పురావస్తు శాస్త్రజ్ఞులు గిద్దలూరు పరిసరాల్లో పాత రాతియుగం (అప్పర్ పేలియోలిథిక్) నాటి మానవుడు నివసించిన ఆధారాలు కనుగొన్నారు.[3] ఇక్కడ మధ్య రాతియుగము నాటి చిన్న రాతి పనిముట్ల పరిశ్రమలు బయల్పడ్డాయి.[4] ఈ చిన్న పనుముట్లు క్వార్ట్‌జ్ చేయబడినవి.[5]
గిద్దలూరు పూర్వ నామం సిద్ధలూరు. సిద్ధలూరు సమీపములోని నాగేశ్వరాలయం దగ్గర ఒక స్థలమును నందన చక్రవర్తి శ్రీవత్స గోత్రజుడు, నందనవారిక వంశానికి చెందిన కుంచాల శివప్పకు అగ్రహారముగా ఇచ్చాడు. కానీ తరువాత ఈ గ్రామం పాడుబడటము వలన, శివప్ప వంశీయుడైన రామచంద్ర నందవరము నకు తరలివెళ్లి, అక్కడి నుండే సిద్ధలూరి వ్రిత్తిని అనుభవించాడు.
శక యుగములో తొండమారయగుళ్ల స్థాపన జరిగిన తరువాత, కుంచెల రామచంద్ర తొండమారయగుళ్ల నాయకుని నుండి కొత్తగా స్థాపించిన సిద్ధలూరిని అగ్రహారముగా పొంది నందవరము నుండి ఇరవై - ముప్పై బ్రాహ్మణ కుటుంబములు, బారబలావతులతో (12 మంది గ్రామ సేవకులు) సహా సిద్ధలూరికి తిరిగి వచ్చాడు. అయితే, తొండమారయగుళ్ల నాయకుని మరణానంతరము ఆ ప్రదేశము నిర్జనమైంది. ఆ కాలములో సిద్ధలూరి ప్రాభవము పెరిగి గ్రిద్ధలూరని కొత్త పేరు సంతరించుకొన్నది. కొంత కాలము తర్వాత గ్రిద్దలూరు అగ్రహారీకుడూ, కుంచాల రామచంద్రుని వంశజుడూ అయిన కుంచెల వెంకటాద్రయ్య గ్రామం చుట్టూ అనేక కుగ్రామాలు స్థాపన చేయించి గిద్దలూరిని మెరుగు పరచెను. అనతి కాలములోనే ఆ కుగ్రామాలు కంచిపల్లె, చట్టిరెడ్డిపల్లె, అక్కలరెడ్డిపల్లె మౌజే లుగా (స్వంతంత్ర గ్రామాలు లేదా ఒక మాదిరి పట్టణములు) ఎదిగినవి. దీనితో గిద్దలూరు కస్బా (ప్రధాన కేంద్రము) అయినది.
హరిహర దేవరాయల కాలములో రామచంద్రరాజు ఈ ప్రాంతములను జాగీర్దారుగా పరిపాలించుటకు వచ్చి ఈ గ్రామంలను వెంకటాద్రి నుండి వశము చేసుకొన్నాడు. కానీ ఆ తర్వాత కాలములో వెంకటాద్రి నుండి ఆ వంశములో మూడవ తరానికి చెందిన రామచంద్ర, హరిహర రాయలచే పునస్థాపించబడి తన గ్రామాలను తిరిగి పొందెను. ఆయన కరణముగా కూడా నియమించబడెను. ఈ విధముగా ముస్లింలు రాక వరకు రామచంద్రరాజు వంశజులు గిద్దలూరు కస్బాను, దాని గ్రామాలను పరిపాలించారు. రాయల పాలన ముగింపుతో గిద్దలూరు ముస్లింల ఆక్రమణకు గురై, ఆ తరువాత కాలములో దత్తమండలాలను నిజాము బ్రిటీషువారికి దత్తము చేసినప్పుడు కడప జిల్లాలో భాగముగా ఉన్న గిద్దలూరు బ్రిటిషు పాలనలోకి వచ్చింది. కర్నూలు జిల్లా యేర్పడిన తర్వాత కర్నూలు జిల్లాలోను భాగమై, 1971లో ఒంగోలు జిల్లా ఏర్పాటు చేసినప్పుడు కొత్తగా ఏర్పడిన జిల్లాలో కలపబడింది.
సగిలేరు నది (స్వర్ణబాహు నది) గిద్దలూరికి దక్షిణాన ప్రవహిస్తున్నది.
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం జనాభా 26,977. ఇందులో పురుషుల సంఖ్య 13,662, మహిళల సంఖ్య 13,315, గ్రామంలో నివాస గృహాలు 5,979 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2,094 హెక్టారులు.
2011 జనగణన ప్రకారం మొత్తం జనాభా 35,150.
గిద్దలూరు నగరపంచాయితీ పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.
గిద్దలూరు గుంటూరు - ద్రోణాచలము రైల్వే లైనుపై ఒక ప్రముఖ రైల్వేస్టేషను.
వరి, అపరాలు, కాయగూరలు
వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత వృత్తులు.
అమ్మ ఆశ్రమం: ఇది కొంగళవీడు రహదారిపై ఉన్నది