గిరిజా వ్యాస్ | |
---|---|
![]() | |
మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ పావర్టీ అలీవియేషన్ (ఇండియా) | |
In office 2013 జూన్ 17 – 2014 మే 26 | |
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ |
అంతకు ముందు వారు | అజెయ్ మాకెన్ |
తరువాత వారు | ముప్పవరపు వెంకయ్య నాయుడు |
వ్యక్తిగత వివరాలు | |
జననం | నాథద్వారా, రాజ్‌పుతానా ఏజెన్సీ, బ్రిటిష్ ఇండియా | 1946 జూలై 8
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
తల్లిదండ్రులు | కృష్ణ శర్మ (తండ్రి), జమునా దేవి వ్యాస్ (తల్లి) |
గిరిజా వ్యాస్ (జననం 1946 జులై 8) ఒక భారతీయ రాజకీయవేత్త, కవి, రచయిత. ఆమె చిత్తోర్‌గఢ్ నియోజకవర్గం నుండి భారత పార్లమెంటు దిగువసభ అయిన 15వ లోక్‌సభ సభ్యురాలు, భారత జాతీయ మహిళా కమిషన్ మాజీ అధ్యక్షురాలు.
గిరిజా వ్యాస్ 1946 జూలై 8న కృష్ణ శర్మ, జమునా దేవి వ్యాస్ దంపతులకు జన్మించింది. తత్వశాస్త్రంలో డాక్టరేట్ పొందిన తరువాత, ఆమె ఉదయపూర్ లోని మోహన్ లాల్ సుఖాడియా విశ్వవిద్యాలయం, డెలావేర్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా చేసింది.
ఆమె ఎనిమిది పుస్తకాలు రాసింది, వాటిలో హిందీ, ఉర్దూ, ఆంగ్లంలో మూడు కవితా సంపుటాలు కూడా ఉన్నాయి. ఎహ్సాస్ కే పర్ లో ఆమె ఉర్దూ కవితలు ఉన్నాయి, సీప్, సముందర్ ఔర్ మోతీ లో ఆమె హిందీ, ఉర్దూ పద్యాలు రెండూ ఉన్నాయి, నోస్టాల్జియా ఆంగ్ల పద్యాలతో సుసంపన్నం చేయబడింది.[1]
1985లో, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, ఆమె రాజస్థాన్ లోని ఉదయపూర్ నుండి శాసనసభ సభ్యురాలిగా ఎన్నికయ్యింది, 1990 వరకు రాజస్థాన్ ప్రభుత్వం మంత్రిగా పనిచేసింది.[2]
1991లో, ఆమె లోక్‌సభలో రాజస్థాన్ లోని ఉదయపూర్ కు ప్రాతినిధ్యం వహిస్తూ భారత పార్లమెంటుకు ఎన్నికయ్యింది, పాములపర్తి వెంకట నరసింహారావు మంత్రిత్వ శాఖలో భారత సమాఖ్య ప్రభుత్వంలో ఉప మంత్రి (సమాచార, ప్రసారం) గా నియమితులయ్యింది.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)