గిరిరాజ్ సింగ్ | |
---|---|
![]() | |
కేంద్ర గ్రామీణాభివృద్ధి & పంచాయతీరాజ్ శాఖ మంత్రి | |
Assumed office 2021 జులై 7 | |
ప్రధాన మంత్రి | నరేంద్ర మోడీ |
అంతకు ముందు వారు | నరేంద్ర సింగ్ తోమర్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | బీహార్ | 1952 సెప్టెంబరు 8
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
జీవిత భాగస్వామి | ఉమా సిన్హా |
సంతానం | 1 |
గిరిరాజ్ సింగ్ (జననం 1952 సెప్టెంబరు 8) భారత దేశానికి చెందిన రాజకీయ నాయకుడు ప్రస్తుతం కేంద్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇతను బీహార్లోని బెగుసరాయ్ లోక్సభ నియోజకవర్గం నుండి 17 వ లోక్ సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
గిరిరాజ్ సింగ్ బీహార్ రాష్ట్రంలోని లఖిసరాయ్ జిల్లా బర్హియ పట్టణంలోరామత్వార్ సింగ్ తార దేవి దంపతులకు జన్మించాడు. ఇతను 1971లో మగధ విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ పట్టా పొందాడు. ఇతనికి ఉమా సిన్హాతో వివాహమైంది, వీరికి ఒక కుమార్తె.[2]
సింగ్ బీహార్ ప్రభుత్వంలో 2005 నుండి 2010 వరకు సహకార మంత్రిగా, 2010 నుండి 2013 వరకు పశుసంవర్ధక మంత్రిగా పనిచేశాడు. ఇతను మొదటి నుండి నరేంద్ర మోడీకి బలమైన మద్దతుదారుడుగా ఉన్నాడు.[3][4]
2019 భారత సార్వత్రిక ఎన్నికలలో సిపిఐ అభ్యర్థి కన్హయ్య కుమార్‌ను ఓడించిన తరువాత, 2019 మేలో కొత్తగా ఏర్పడిన పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్య మంత్రిత్వ శాఖకు కేబినెట్ మంత్రి అయ్యాడు.
నరేంద్ర సింగ్ తోమర్ స్థానంలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ తరువాత 2021 జూలైలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, రెండవ మోడీ మంత్రిత్వ శాఖలో పంచాయతీ రాజ్ మంత్రి అయ్యారు.[5][6]
Father's Name: Shri Ramavtar Singh Mother's Name: Late Smt. Tara Devi