గిరీష్ భరద్వాజ్ (జననం: 1950 మే 2 ) భారతదేశంలోని మారుమూల గ్రామాలలో 127 వంతెనలను నిర్మించినందుకు సేతు బంధు, బ్రిడ్జ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలువబడే ఒక భారతీయ సామాజిక కార్యకర్త. 2017లో ఆయనకు పద్మశ్రీ పురస్కారం లభించింది. [1][2][3][4]
భరద్వాజ్ 1950 మే 2న కర్ణాటక సుల్లియా లో జన్మించాడు. 1973లో మాండ్య పి. ఇ. ఎస్. కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి మెకానికల్ ఇంజనీరింగ్ పట్టభద్రుడయ్యాడు.[1][5] అతని భార్య ఉష. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.
ఆయన 1989లో దక్షిణ కర్ణాటకలోని అరంబూర్ వద్ద పయస్విని నదిపై తన మొదటి వంతెనను నిర్మించాడు. అప్పటి నుండి, ఆయన కేరళలో సుమారు ముప్పై వంతెనలను, తెలంగాణ, ఒడిశాలో రెండు వంతెనలని నిర్మించాడు, మిగిలిన వంతెనలు కర్ణాటకలోని వివిధ ప్రాంతాలలో ఉన్నాయి.[3][6]