Guntur Kaaram | |
---|---|
దర్శకత్వం | త్రివిక్రమ్ శ్రీనివాస్ |
రచన | త్రివిక్రం శ్రీనివాస్ |
నిర్మాత | ఎస్.రాధాకృష్ణ |
తారాగణం | |
ఛాయాగ్రహణం | పి.ఎస్.వినోద్ |
కూర్పు | నవీన్ నూలి |
సంగీతం | తమన్ |
నిర్మాణ సంస్థ | హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ |
విడుదల తేదీ | 11 జనవరి 2024 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | ₹150 కోట్లు[1] |
బాక్సాఫీసు | ₹250 కోట్లు[2] |
గుంటూరు కారం త్రివిక్రమ్ శ్రీనివాస్ రచించి, దర్శకత్వం వహించిన, హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్. రాధా కృష్ణ నిర్మించిన భారతీయ తెలుగు-భాష ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం. ఈ చిత్రంలో మహేష్ బాబు, శ్రీలీల, జగపతి బాబు నటించారు.
ఈ చిత్రం 2021 మేలో SSMB28 అనే తాత్కాలిక పేరుతో అధికారికంగా ప్రకటించబడింది, ఎందుకంటే ఇది ప్రధాన నటుడిగా మహేష్ బాబు 28వ చిత్రం. 2023 మే 31న చిత్ర అధికారిక టైటిల్‌ను గుంటూరు కారం అని వెల్లడించారు. చిత్రీకరణ 2022 సెప్టెంబరు 12న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రారంభమైంది. నేపథ్య సంగీతం, పాటలను థమన్ ఎస్ స్వరపరిచారు, సినిమాటోగ్రఫీ పి.ఎస్.వినోద్, ఎడిటింగ్ నవీన్ నూలి నిర్వహించారు.
గుంటూరు కారం 2024 జనవరి 11న సంక్రాంతితో పాటు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది.
ఈ చిత్రంలో అన్ని పాటలు రాసినవారు: రామజోగయ్య శాస్త్రి
సం. | పాట | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|
1. | "దమ్ మసాలా" | సంజిత్ హెగ్డే , జ్యోతి నూరన్ | 3:26 |
2. | "ఓ మై బేబీ" | శిల్పా రావు | 2:36 |
3. | "కూర్చి మడతపెట్టి[4]" | సాహితీ చాగంటి, శ్రీ కృష్ణ | 3:36 |
మొత్తం నిడివి: | 9:47 |