గుండెల్లో గోదారి | |
---|---|
దర్శకత్వం | నాగేంద్ర కుమార్ |
నిర్మాత | మంచు లక్ష్మి |
తారాగణం | ఆది పినిశెట్టి మంచు లక్ష్మి సందీప్ కిషన్ తాప్సీ |
ఛాయాగ్రహణం | ఎం. ఆర్. పళనికుమార్ |
సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థ | మంచు ఎంటర్టైన్మెంట్ |
పంపిణీదార్లు | బ్లూ స్కయ్ (విదేశాలు) [1] |
విడుదల తేదీ | 8 మార్చి 2013 |
సినిమా నిడివి | 131 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాషలు | తెలుగు తమిళం |
గుండెల్లో గోదారి నాగేంద్ర కుమార్ దర్శకత్వంలో 2013 మార్చి 8న విడుదలైన తెలుగు చిత్రం. ఇందులో ఆది పినిశెట్టి, మంచు లక్ష్మి, సందీప్ కిషన్, తాప్సీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం దివిసీమ ఉప్పెన నేపథ్యంలో తెరకెక్కింది.
అప్పుడే పెళ్ళయిన మల్లి (ఆది పినిశెట్టి), చిత్ర (మంచు లక్ష్మి) ఇంకా పెళ్ళిపీటలు దిగకముందే వారుంటున్న గ్రామాన్ని గోదావరి వరద చుట్టుముడుతుంది. వధూవరులిద్దరూ ఈదుకుంటూ ఒక ఆధారాన్ని దొరకబుచ్చుకుంటారు. చావుకు దగ్గరైన జీవితాలు ఒకరి గతాన్ని ఒకరు చెప్పుకోవడానికి ఉపక్రమించడంతో చిత్ర కథ మొదలవుతుంది. వారిరువురికీ ఎదురైన గతానుభవాలే చిత్రకథ సమాహారం.
గానం - ఇళయరాజా, రచన - చంద్రబోస్
గానం - ఆండ్రియా & హేమచంద్ర, రచన - అనంత శ్రీరామ్
గానం - గీతా మాధురి, రచన - ఆర్. రాము
గానం - భవతారిణి, రచన - అనంత శ్రీరామ్
గానం - మనో & అనిత, రచన - అనంత శ్రీరామ్
గానం - రమ్యా ఎన్ఎస్కె, రచన - ఆర్. రాము
గానం - శ్రీ వర్ధిని, రచన - పళని భారతి
2013 సైమా అవార్డులు