గుగ్గుల్‌స్టెరోన్(Guggulsterone) అనేది కమిఫోరా వైటీ. (Commiphora wightii) మొక్క గమ్ రెసిన్ నుండి తీసుకోబడిన స్టెరాల్.ఆయుర్వేదంలో అంతర్గత కణితులు, ఊబకాయం, కాలేయ రుగ్మతలు, ప్రాణాంతక పుండ్లు మరియు పూతల, మూత్ర ఫిర్యాదులు, పేగు పురుగులు, ల్యూకోడెర్మా, సైనస్‌లు, ఎడెమా మరియు ఆకస్మిక పక్షవాతం మూర్ఛలు వంటి వివిధ రుగ్మతలకు చికిత్స చేయడానికి గుగ్గులుమొక్కల నుండి గమ్ రెసిన్ వెయ్యి సంవత్సరాలుగా ఉపయోగించబడింది.గుగ్గుల్‌స్టెరోన్ ఈ గమ్ రెసిన్ యొక్క బయోయాక్టివ్ భాగాలుగా గుర్తించబడింది.ఈ ప్లాంట్ స్టెరాయిడ్ కొన్ని అణు గ్రాహకాల యొక్క విరోధిగా పని చేస్తుందని నివేదించబడింది, ముఖ్యంగా పిత్త ఆమ్లాలు మరియు కొలెస్ట్రాల్ జీవక్రియను నియంత్రించే ఫర్నేసోయిడ్ X రిసెప్టర్.[1]కణితి కణాలలో యాంటీ-అపోప్టోటిక్, సెల్ సర్వైవల్, సెల్ ప్రొలిఫరేషన్, యాంజియోజెనిక్, మెటాస్టాటిక్ మరియు కెమోరెసిస్టెంట్ కార్యకలాపాలలో పాల్గొన్న ప్రోటీన్‌ల వ్యక్తీకరణనుగుగ్గుల్‌స్టెరోన్ తగ్గించినట్లు చూపబడింది.గుగ్గుల్‌స్టెరాన్ ట్రాన్స్‌క్రిప్షన్ కారకాల నియంత్రణ ద్వారా జన్యు వ్యక్తీకరణను మధ్యవర్తిత్వం చేస్తుంది, ఇందులో న్యూక్లియర్ ఫ్యాక్టర్-కప్పా B మరియు సిగ్నల్ ట్రాన్స్‌డ్యూసర్ మరియు ట్రాన్స్‌క్రిప్షన్ 3 యాక్టివేటర్ ఉన్నాయి, ఇది వాపు మరియు ట్యూమోరిజెనిసిస్ అభివృద్ధిలో ముఖ్యమైన పాత్రలను పోషిస్తుంది.[1]
ఈ మొక్క పొద వంటి మొక్క. దీనిని తెలుగులో గుగ్గిపన్ను అనికూడా పిలుస్తారు. ఈ మొక్క భారత దేశం లో రాజస్థాన్,కర్ణాటక,గుజరాత్ మరియు మహారాష్ట్ర లలోని పొడి ప్రాంతాలలో పెరుగును.2-3 మీటర్ల ఎత్తువరకు పెరుగును. ఎక్కువ కొమ్మలను కలిగి వెండి రంగు బెరడును కాలగి వుండును. ప్రతి మొక్క నుండి 0.5 నుండి 1 కిలో ఒలియో గమ్(రెజిన్)వస్తుంది.[2]
ఒలియో రెజిన్ లో జిగురు(Gum)పదార్థం 60%,రెజిన్(resin) అనేది 30% వరకు,0.5 నుంది 1.5% వరకు వొలటైల్ నూనెలు(తక్కువ ఉష్ణొగ్రతలొ బాష్పీకరణ చెందు నూనెలు)వుండగా,తేమ 5% వరకు ఉండును.ఇక ఇతర అన్య పదార్థాలు 3 నుంది 4% వరకు ఉండును.[2]
గుగ్గుల్ గం రెజిన్ ను 120-130°C ఉష్ణొగ్రత వద్ద ఇథైల్ అసిటెట్లో కలిపినపుడు,అందులో రెసిన్ కరుగుతుంది,గమ్/జిగురు కరుగని పదార్థంగా మిగిలి పొతుంది. ఇథైల్ అసిటెట్ లోకరిగిన రెజిన్ రెండు భాగాలుగా వేరుచెయ్యబడును.అందులో 94% వరకు తటస్థ పదార్థం,4-5% అమ్లతత్వ పదార్థం వుండును.అమ్లతత్వ పదార్థం శొధనిరోధక(anti-inflammatory)గుణం కల్గి వున్నది.తతస్థ గుణమున్న పదార్థం లో 12% వరకు కెటోనిక్ రసాయన పదార్థం వుండగా.88% వరకు కెటోనిక్ కాని పదార్థం వుండును.ఈ 12% పదార్థంలో హైపోలిపిడెమిక్ మరియు హైపోకొలెస్టెరిమిక్ పదార్థాలు వుండును.హైపోకొలెస్టెరిమిక్ పదార్థ భగంలో జెడ్-గుగ్గుల్‌స్టెరోన్ మరియు ఈ-గుగ్గుల్‌స్టెరోన్ లు వుండును.[2]
గుగ్గుల్‌స్టెరోన్ ఒక 3-హైడ్రాక్సీ స్టెరాయిడ్. ఇది ఆండ్రోజెన్ పాత్రను కలిగి ఉంది.కమ్మిఫోరా ముకుల్ మరియు కమ్మిఫోరా వైటీ మొక్కలలఒ కనుగొనబడిన సహజ ఉత్పత్తి.[3]ప్రయోగాత్మక అధ్యయనాలు గమ్ గుగ్గుల్ మరియు దాని సజల మరియు స్టెరాయిడ్ భిన్నాలు వాపు యొక్క వివిధ నమూనాలలో శోథ నిరోధక చర్యలను కలిగి ఉన్నాయని నిర్ధారించాయి.[4](Z)-గుగ్గుల్‌స్టెరాన్ అనేది న్యూక్లియర్ హార్మోన్ రిసెప్టర్, ఇది కొలెస్ట్రాల్ జీవక్రియలో పాల్గొన్న అనేక జన్యువుల లిప్యంతరీకరణను నియంత్రిస్తుంది మరియు కొలెస్ట్రాల్ స్థాయి నియంత్రణలో పాత్రను పోషిస్తుంది. గుగ్గుల్‌స్టెరోన్ ను మొక్క యొక్క బెరడు నుండి తీస్తారు. బెరడు నుండి మొదట తీసిన పదార్థాన్ని ఒలియో రెజిన్ అంటారు. అందునుండి గుగ్గుల్‌స్టెరోన్ ను వేరు చేస్తారు.
భారతదేశం, బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్‌లలో పెరిగే గుగ్గుల్ చెట్టు, (కమ్మిఫోరా ముకుల్ నుండి సంగ్రహించిన/తీసిన ఒలియోగమ్ రెసిన్ (గుగ్గుల్ అని పిలుస్తారు) అనేక వేల సంవత్సరాలుగా హైపర్-కొలెస్టెరోలేమియా, అథెరోస్క్లెరోసిస్( రక్తనాళాలు గట్టిపడటం), కీళ్ళవాతంమరియు ఊబకాయంతో సహా వివిధ వ్యాధుల చికిత్సకు ఉపయోగించబడింది.[5]
గుగ్గుల్‌స్టెరోన్ ఘనస్థితిలో ,పొడి రూపంలో వుండును.లేత పసుపు రంగు కల్గి వుండును.[6]2-8°C ఉష్ణోగ్ర్త వద్ద నిల్వ ఉంచడం అవసరం.
IUPAC పేరు:(8R,9S,10R,13S,14S,17E)-17-ఇథైలిడిన్-10,13-డైమిథైల్-1,2,6,7,8,9,11,12,14,15-డెకాహైడ్రోసైక్లోపెంటా[a]ఫెనాంత్రీన్- 3,16-డియోన్
లక్షణం/గుణం | మితి/విలువ |
అణు సూత్రం | C21H28O2 |
అణు భారం | 312.45 గ్రా?మోల్ [7] |
మరుగు ఉష్ణోగ్రత | 463.30°C.(అంచనా)[8] |
ఫ్లాష్ పాయింట్ | 172.30 °C(అంచనా)[8] |
నీటిలో ద్రావణియత 13.75 మి.గ్రా/లీకు, 25 °C వద్ద [9]