గుత్తా సుఖేందర్ రెడ్డి | |||
గుత్తా సుఖేందర్ రెడ్డి | |||
తెలంగాణ శాసనమండలి చైర్మన్
| |||
పదవీ కాలం 14 మార్చి 2022 - ప్రస్తుతం | |||
నియోజకవర్గం | నల్గొండ | ||
---|---|---|---|
ఎమ్మెల్సీ
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 01 డిసెంబర్ 2021 నుండి 30 నవంబర్ 2027 | |||
నియోజకవర్గం | ఎమ్మెల్యే కోటా | ||
తెలంగాణ శాసనమండలి చైర్మన్
| |||
పదవీ కాలం 11 సెప్టెంబర్ 2019 - 3 జూన్ 2021 | |||
ముందు | కనకమామిడి స్వామి గౌడ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ఉర్మడ్ల,చిట్యాల మండలం, నల్లగొండ జిల్లా, ఆంధ్రప్రదేశ్ | 1954 ఫిబ్రవరి 2||
రాజకీయ పార్టీ | తెలంగాణ రాష్ట్ర సమితి | ||
జీవిత భాగస్వామి | అరుంధతి | ||
సంతానం | 1 కొడుకు (గుత్తా అమిత్ రెడ్డి), 1 కుమార్తే | ||
మతం | హిందూ మతం |
గుత్తా సుఖేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎంపి.[1] ఆయన తెలంగాణ శాసనమండలికి 2021లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా రెండోసారి నవంబరు 22న ఎన్నికయ్యాడు.[2] ఆయన ఈ పదవిలో 2021 డిసెంబరు 01 నుండి 2027 నవంబరు 30 వరకు కొనసాగుతాడు.[3]
ఈయన నల్లగొండ జిల్లాలోని ఉర్మడ్ల గ్రామంలో సరస్వతమ్మ, వెంకట్ రెడ్డి దంపతులకు1954, ఫిబ్రవరి 2న జన్మించాడు.[4][5] నాగక్రమం భగవాన్ దాస్ సైన్స్ కళాశాల ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాద్ లో నుండి బి.యస్సీ. పట్టా పొందాడు.
1977, మే 1న అరుంధతితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు అమిత్‌రెడ్డి[6], ఒక కుమార్తె.[7]
గుత్తా సుఖేందర్ రెడ్డి మొదట్లో కమ్యూనిస్టు పార్టీలో, ఆ తరువాత తెలుగుదేశం, కాంగ్రెస్ లో పనిచేశాడు. సుఖేందర్‌రెడ్డి 2004 పార్లమెంట్ ఎన్నికల్లో టిడిపి నుంచి, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎంపీగా గెలిచాడు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీచేసి గెలిచి 2016, జూన్ 15న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. 2018, మార్చిలో ముఖ్యమంత్రి కెసీఆర్ ఆయనను రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షునిగా నియమించాడు. 2018, మార్చి 12వ తేదిన రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా ఆయన ప్రమాణాస్వీకారం చేశాడు. 2019 ఆగస్టులో శాసనమండలికి ఎమ్మెల్యే కోటా నుండి టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. అనంతరం రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ పదవికి రాజీనామా చేశాడు. తెలంగాణ శాసనమండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికై, 2019 సెప్టెంబరు 11న బాధ్యతలు చేపట్టాడు.[8][9][10] 2021, జూన్ 3న గుత్తా సుఖేందర్ రెడ్డి పదవీకాలం ముగిసింది.
గుత్తా సుఖేందర్ రెడ్డి తెలంగాణ శాసనమండలికి 2021లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2021 నవంబరు 16న టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారై, నవంబరు 22న ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[11] గుత్తా సుఖేందర్ రెడ్డి తెలంగాణ శాసనమండలి చైర్మన్‌గా మార్చి 13న నామినేషన్ దాఖలు చేశాడు,[12] మండలి ఎన్నికకు ఒకే ఒక్క నామినేషన్ రావడంతో చైర్మన్‌గా మార్చి 14న ఏకగ్రీవంగా ఎన్నికై రెండోసారి బాధ్యతలు చేపట్టాడు.[13]
వ్యవపాయదారులు
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)