గుమ్మడి జయకృష్ణ | |
---|---|
జననం | |
ఇతర పేర్లు | జె.కె |
వృత్తి | ఛాయాగ్రాహకుడు. |
బిరుదు | FTII |
తల్లిదండ్రులు | గుమ్మడి జయప్రకాష్ జానకీ రాణి |
గుమ్మడి జయకృష్ణ సినిమా ఛాయాగ్రాహకుడు.ఆయన తెలుగు, మలయాళ సినిమాలకు ఛాయాగ్రాహకునిగా పనిచేసారు.
ఆయన విజయవాడలో 1974 మార్చి 20 న జన్మించారు. ఆయన నేషనల్ ఫిల్ం అవార్డును నాన్-ఫీచర్ ఫిల్ం ఛాయాగ్రాహణానికి గానూ పొందారు. ఆయన తీసిన నాన్-ఫీచర్ ఫిల్మ్ "వెన్ దిస్ మ్యాన్ డైస్".[1]
ఆయన 10వతరగతి చదువుతున్నప్పుడు సినిమాటోగ్రఫీ పై మక్కువ పెంచుకున్నారు. ఆయన "గీతాంజలి(1989)" సినిమా సినిమాటోగ్రఫీ చూసి ప్రభావితులైనారు. ఆయన తల్లిదండ్రులు ఆయనను ప్రోత్సహించారు. 12 సంవత్సరాల పాఠశాల విద్య అనంతరం ఆయన FTIIలో చేరాలనుకున్నారు. కానీ డిగ్రీ సర్టిఫికేటు అవసరమైంది. అందువలన ఆయన జె.ఎన్.టి.యులో ఫొటోగ్రఫీలో డిగ్రీ చేసారు. ఆయన సినిమాటోగ్రాఫర్ సమీరా రెడ్డి వద్ద అసిస్టెంటుగా 2 సంవత్సరాలు చేసారు. 2004 లో ఆయన చలన చిత్ర ఫోటోగ్రఫీలో గ్రాడ్యుయేషన్ ను పూణె లోని "ఫిల్ం అండ్ టెలివిజన్ ఇనిస్టీట్యూట్ ఆఫ్ ఇండియా"లో చేసారు. ఆయన FTIIలో విద్యార్థిగా యున్నప్పుడే ఆయన సంభాషణా చిత్రం కొడక్ ఫిల్ం స్కూల్ కాంపిటేషన్లో జాతీయ స్థాయిలో గెలుపొందింది.
FTII కీ గ్రాద్యుయేషన్ చేసిన తరువాత ఆయన హైదరాబాదు వచ్చి తెలుగు సినిమా మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి కి సినిమాటోగ్రాఫర్ గా చేసారు. 2007 లో ఆయన చేసిన సినిమా ఒక్కడున్నాడు రిలీస్ అయినది. 2008 లో ఇదీ సంగతి కి గుర్తింపు పొందారు. ఆయన అనేక లఘుచిత్రాలకు ఛాయాగ్రహణం చేసారు.
2010 లో ఆయన ఛాయాగ్రహణం చేసిన మరాఠీ చిత్రం "విహిర్"కు ఆస్ట్రేలియా లోని ఆసియా పసిఫిక్ స్క్రీన్ అవార్డ్స్ లో ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్దు గెలుచుకుంది.