పట్టణం | |
Coordinates: 16°33′22″N 79°38′00″E / 16.55625°N 79.63345°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పల్నాడు జిల్లా |
మండలం | గురజాల మండలం |
విస్తీర్ణం | |
• మొత్తం | 43.41 కి.మీ2 (16.76 చ. మై) |
జనాభా (2011)[1] | |
• మొత్తం | 26,190 |
• జనసాంద్రత | 600/కి.మీ2 (1,600/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1025 |
ప్రాంతపు కోడ్ | +91 ( 08649 ) |
పిన్(PIN) | 522415 |
Website |
గురజాల ఆంధ్ర ప్రదేశ్ పల్నాడు జిల్లా, గురజాల మండలం లోని గ్రామం, ఇది మునిసిపల్ పట్టణం, అదే పేరుతో గల మండలానికి కేంద్రం.ఇది సమీప పట్టణమైన మాచర్ల నుండి 28 కి.మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 7045 ఇళ్లతో, 26190 జనాభాతో 4341 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 12931, ఆడవారి సంఖ్య 13259. షెడ్యూల్డ్ కులాల జనాభా 3687 కాగా షెడ్యూల్డ్ తెగల జనాభా 1134. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 589846.[2] పిన్ కోడ్: 522415.
హైహయ వంశపు రాజు అలుగురాజు గురజాలను రాజధానిగా చేసుకుని పలనాడును పాలించాడు. అతని వారసుడు నలగాముడు గురజాలనే రాజధానిగా చేసుకున్నాడు. నలగాముడి సోదరుడైన మలిదేవుడు, మాచర్లను రాజధానిగా చేసుకుని తన రాజ్యాన్ని పాలించాడు. ఈ దాయాదుల మధ్య జరిగిన పోరే ఆంధ్ర కురుక్షేత్రంగా పేరుగాంచిన పల్నాటి యుద్ధం.
ఇది సమీప పట్టణమైన మాచర్ల నుండి 28 కి. మీ. దూరంలో ఉంది.
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 24,550. ఇందులో పురుషుల సంఖ్య 12,430, స్త్రీల సంఖ్య 12,120, గ్రామంలో నివాస గృహాలు 5,827 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణము 4,341 హెక్టారులు.
దీని పరిపాలన గురజాల నగరపంచాయితీ నిర్వహిస్తుంది.
గ్రామంలో ఒక బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 11, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు 9, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. 2 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 2 ప్రైవేటు ఆర్ట్స్, సైన్స్, డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. సమీప ఇంజనీరింగ్ కళాశాల మాచర్లలో ఉంది.సమీప వైద్య కళాశాల గుంటూరులోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు మాచర్లలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం మాచర్లలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరులోనూ ఉన్నాయి.
సమీప జాతీయ రహదారి 167A 14 కి.మీ దూరంలో దాచేపల్లి పట్టణంలో పోతుంది.
2011 జనగణన ప్రకారం భూ వినియోగం కింది విధంగా ఉంది:
వరి. అపరాలు, కాయగూరలు
గురజాల పట్టణంలోని గురజాలమ్మ ఆలయ పరిసరాలలో, 2017, జూన్-3న, సా.శ. నాల్గవ శతాబ్దానికి చెందిన మహిసాసురమర్దని శిలా ఫలకం బయల్పడినది. ఈ ప్రతిమ లక్షణాలనుబట్టి, ఇది విష్ణుకుండినుల కాలంనాటిదిగా పురావస్తు శాస్త్రజ్ఞుల అభిప్రాయం.