గురుపుర నది | |
ఫాల్గుని నది, కులూర్ నది | |
దేశం | భారతదేశం |
---|---|
రాష్ట్రం | కర్ణాటక |
Region | ప్రాంతం |
Cities | మంగుళూరు, గురుపుర |
గురుపుర నదీ ( ఫాల్గుని నది లేదా కులూర్ నదిగా కూడా పిలువబడుతుంది[1]) భారతదేశం లోని కర్ణాటక రాష్ట్రంలో గల నది.[2] ఇది దక్షిణ కనుమలలో జన్మించి మంగుళూరు వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. మంగుళూరు దగ్గరలో గల "గురుపుర" పట్టణం గుండా పోవుచున్నందున దీనిని గురుపుర నది అని పిలుస్తారు.
ఈ నది ఉత్తర తీరాన "న్యూ మంగుళూరు ఫోర్టు", "మంగుళూరు కెమికల్ ఫెర్టిలైజర్స్" వంటి సంస్థలు నెలకొని ఉన్నాయి. ఒకానొక సమయంలో ఈ నది మంగుళూరు నగరానికి ఉత్తర హద్దుగానూ, దక్షిణ హద్దుగా నేత్రావతి నది ఉంటాయి.