గుర్లిన్ చోప్రా | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | సినిమా నటి, మోడల్. |
క్రియాశీల సంవత్సరాలు | 2003–ప్రస్తుతం |
ఎత్తు | 1.70 మీ. (5 అ. 7 అం.) |
తల్లిదండ్రులు | హర్జిత్ సింగ్ చోప్రా అనూప్ చోప్రా |
గుర్లిన్ చోప్రా,[1] భారతీయ సినిమా నటి, మోడల్. హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ,[2] కన్నడ, పంజాబీ సినిమాలలో నటించింది.[3]
హర్జిత్ సింగ్ చోప్రా, అనూప్ చోప్రా దంపతులకు చండీగఢ్ లో గుర్లిన్ చోప్రా జన్మించింది.
చిన్న వయసులోనే గుర్లీన్ చోప్రా "మిస్ చండీగఢ్"గా ఎంపికైంది. తన స్నేహితుల సలహాతో మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది. సినిమాల్లో నటించాలనుకున్నప్పుడు మొదట్లో ఆమె తల్లిదండ్రులు వ్యతిరేకించారు. లారెన్స్ డిసౌజా దర్శకత్వంలో సినిమా చేయడానికి అంగీకరించారు.[4]
1993లో సుర్జిత్ బింద్రాఖియా 'టెడి టెడి తక్డి తు' పాటలో మోడల్‌గా గుర్లీన్ చోప్రా అరంగేట్రం చేసి, ఇండియన్ బాబు అనే హిందీ సినిమాతో సినిమారంగంలోకి అడుగుపెట్టింది.[5] తరువాత కుచ్ తో గడ్బాద్ హై సినిమాలో రియా అనే అనాథ అమ్మాయిగా నటించింది.[6] 2003లో వచ్చిన ఆయుధం[7] సినిమాతో తెలుగు సినిమాలో అడుగుపెట్టింది. అనేక తెలుగు, కన్నడ, తమిళ సినిమాలలో నటించింది. మన్మత సినిమాలో డబుల్ రోల్ చేసింది. ఈ సినిమాలో ఆమె నటన గురించి,"లక్ష్మి వంటి బ్లైండ్ పాత్రలో లో గుర్లిన్ చోప్రా అకట్టుకుంది" అని సిఫీ రాసింది.[8] "ఆమె రెండు పాత్రల్లో చక్కగా నటించింది" అని రీడిఫ్ రాసింది.[9] 2004లో తన మొదటి తమిళ సినిమా తుల్లాల్పై[10][11] లో నటించగా, అది 2007లో విడుదలైంది. ఆ తర్వాత పంజాబీ సినిమారంగంలోకి వెళ్ళి అక్కడ కొన్ని సినిమాల్లో నటించింది. హషర్ సినిమాలో, బాబ్బు సరసన నటించింది. 2009లో తెలుగులో కోనసీమలో చిట్టేమ్మ కిట్టయ్య[12] సినిమాలో, వాస్తవం అనే 3డి తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమాలో నటించింది.[13] 2015లో మరాఠీ తొలి చిత్రం షిన్మా సినిమాలో నటించింది.[2]
సంవత్సరం | సినిమా | పాత్ర | భాష | గమనికలు |
---|---|---|---|---|
2003 | ఇండియన్ బాబు | దిల్ | హిందీ | |
2003 | ఆయుధం | శ్రావణి | తెలుగు | |
2004 | ఒక పెళ్ళాం ముద్దు రెండో పెళ్ళాం వద్దు | మీనా | తెలుగు | |
2004 | నేను సైతం | తెలుగు | ||
2004 | సర్దారా | ప్రియా | కన్నడ | |
2004 | కుచ్ తో గద్బాద్ హై | రియా సింగ్ | హిందీ | |
2005 | విష్ణు సేన | కన్నడ | ||
2005 | కాకి | ఫరా | తెలుగు | |
2006 | బాగి | ప్రీత్ | పంజాబీ | |
2006 | పాండవరు | అంజలి | కన్నడ | |
2006 | భాగం భాగ్ | నిషా చౌహాన్ | హిందీ | |
2007 | మన్మత | లక్ష్మి / ప్రియా | కన్నడ | |
2007 | తుల్లాల్ | శ్రుతిక | తమిళం | |
2008 | హషర్: ఎ లవ్ స్టోరీ | షగన్ | పంజాబీ | |
2010 | కబడ్డీ ఇక్ మొహబ్బత్ | రౌనాక్ గిల్ | పంజాబీ | |
2010 | నానే ఎన్నూల్ ఇల్లాయ్ | తమిళం | ||
2012 | అజ్జ్ డి రంజే | క్రాంతి | పంజాబీ | |
2012 | సిర్ఫైర్ | పంజాబీ | ||
2014 | పాండవులు పాండవులు తుమ్మెద | తెలుగు | ||
2014 | కిర్పాన్: ది స్వోర్డ్ ఆఫ్ ఆనర్ | జాస్మిన్ | పంజాబీ | |
2014 | శివ కేశవ్ | తెలుగు | ||
2014 | ఆ గయే ముండే యుకె డి | డాలీ | పంజాబీ | |
2015 | షిన్మా | మరాఠీ | ||
2015 | ఇంటర్నేషనల్ హీరో | హిందీ | ||
2017 | యాష్లే | యాష్లే | హిందీ | |
2017 | గేమ్ ఓవర్ [14] | సనయ | హిందీ | |
2019 | జై ఛతి మా | హిందీ | ||
2020 | 1840 హైదరాబాద్ | సిమ్రాన్ | హిందీ |
{{cite web}}
: CS1 maint: archived copy as title (link)