గులాం మొహమ్మద్ సాజ్నావాజ్ | |
---|---|
మరణం | 2014 ఏప్రిల్ 13 శ్రీనగర్ | (వయసు 73)
జాతీయత | భారతీయుడు |
వృత్తి | గాయకుడు |
పురస్కారాలు | పద్మశ్రీ, సంగీత నాటక అకాడమీ పురస్కారం |
గులాం మొహమ్మద్ సాజ్నవాజ్ (మరణం 2014 ఫిబ్రవరి 13) ప్రపంచంలో కాశ్మీరీ సూఫియానా సంగీతంలో చివరిగా ప్రసిద్ధి చెందిన గురువు. మతపరమైన, సామాజిక పక్షపాతం కారణంగా కాశ్మీర్ నుండి చాలా మంది విద్యార్థులను ఆకర్షించనప్పటికీ, తన సంగీత శైలిని బోధించడానికి అతను ఒక పాఠశాలను ప్రారంభించాడు. 2013లో భారతదేశపు నాలుగో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ అందుకున్నాడు. కాశ్మీర్ కు చెందిన సూఫియానా కలాం కు అతను చేసిన సేవలకు గాను 1998 లో సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా అందుకున్నాడు. అతను 74 సంవత్సరాల వయసులో 2014లో శ్రీనగర్ మరణించాడు.[1]