గుల్ మొహమ్మద్

గుల్ మొహమ్మద్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ(1921-10-15)1921 అక్టోబరు 15
లాహోర్, బ్రిటిషు భారతదేశం
మరణించిన తేదీ1992 మే 8(1992-05-08) (వయసు 70)
లాహోర్, పాకిస్తాన్
ఎత్తు5 అ. 5 అం. (1.65 మీ.)
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుఎడమచేతి మీడియం పేస్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టులు
తొలి టెస్టు (క్యాప్ 27/24)1946 జూన్ 22 
ఇండియా - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు1956 అక్టోబరు 11 
పాకిస్తాన్ - ఆస్ట్రేలియా తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు First-class
మ్యాచ్‌లు 9 118
చేసిన పరుగులు 205 5,614
బ్యాటింగు సగటు 12.81 33.81
100లు/50లు 0/0 12/21
అత్యధిక స్కోరు 34 319
వేసిన బంతులు 77 7,295
వికెట్లు 2 107
బౌలింగు సగటు 12.00 27.20
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 3
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 2/21 6/60
క్యాచ్‌లు/స్టంపింగులు 3 60
మూలం: Cricinfo, 2016 జూన్ 13

గుల్ మొహమ్మద్ (1921 అక్టోబరు 15 - 1992 మే 8), భారత, పాకిస్తాన్‌ రెండు జట్ల తరఫునా ఆడిన టెస్ట్ క్రికెట్ ఆటగాడు. అతను లాహోర్‌లోని ఇస్లామియా కాలేజీలో చదువుకున్నాడు.

గుల్ మొహమ్మద్ 5' 5 ఎత్తున్న చిన్న వ్యక్తి. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్, కవర్ స్థానంలో చక్కటి ఫీల్డర్. 17 సంవత్సరాల వయస్సులో తొలి ఫస్ట్ క్లాస్ ఆట ఆడాడు. బాంబే పెంటాంగ్యులర్‌లో తన మొదటి మ్యాచ్‌లో 95 పరుగులు చేశాడు. 1942/43లో, అతను బెంగాల్ సైక్లోన్ XIకి వ్యతిరేకంగా బీజాపూర్ ఫామిన్ XI తరపున 144 పరుగులు చేయడమే కాకుండా, విజయ్ హజారేతో కలిసి 302 పరుగులు జోడించాడు. స్లో, ఫ్లాట్ వికెట్‌పై ఇరు జట్లు కలిసి తొలి ఇన్నింగ్స్‌లో 1376 పరుగులు చేసారు.

రంజీ ట్రోఫీ ఫైనల్‌లో హోల్కర్‌పై బరోడా తరఫున అతను చేసిన 319 పరుగులే గుల్ మొహమ్మద్ యొక్క అత్యంత ప్రసిద్ధ ఇన్నింగ్స్. గుల్ 3 వికెట్లకు 91 పరుగుల వద్ద స్కోరు వద్ద విజయ్ హజారేతో కలిసి ఆట మొదలు పెట్టాడు. 533 నిమిషాల తర్వాత ఔట్ అయినప్పుడు, వారిద్దరూ 577 పరుగులు జోడించారు. అప్పటికి అది ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో ఏ వికెట్‌కైనా ప్రపంచ రికార్డు. పదిన్నర గంటల్లో హజారే 288 పరుగులు చేశాడు. ఆ ఇన్నింగ్స్‌లో వారు, లాలా అమర్‌నాథ్ రుసీ మోడీ ల మధ్య ఉన్న 410 పరుగుల భారత రికార్డును, ఫ్రాంక్ వోరెల్, క్లైడ్ వాల్‌కాట్‌ల మధ్య ఉన్న 574* ప్రపంచ రికార్డునూ అధిగమించారు.


గుల్ మొహమ్మద్ 1946లో ఇంగ్లండ్ లోను, 1947/48 లో ఆస్ట్రేలియాలోనూ పర్యటించి టెస్టు మ్యాచ్‌లు ఆడినా పెద్దగా విజయం సాధించలేదు. అడిలైడ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో అతని అత్యధిక స్కోరు 34 కాగా, మరో ఎండ్‌లో హజారే తన రెండో సెంచరీని సాధించాడు. 1952/53లో, అతను ఇండియా తరఫున మొదటి సిరీస్‌లో రెండు టెస్టులలో పాకిస్తాన్‌తో ఆడాడు. కొంతకాలం, అతను లాంక్షైర్ లీగ్‌లో రామ్‌స్‌బాటమ్‌ జట్టులో ఆడాడు.

అతను 1955లో పాకిస్తాన్ పౌరసత్వం తీసుకునే వరకు రంజీ ట్రోఫీలో ఆడాడు. 1956/57లో ఆస్ట్రేలియాకు వ్యతిరేకంగా పాకిస్తాన్ తరపున ఒక టెస్ట్ ఆడాడు, అక్కడ అతను 12, 27 నాటౌట్ పరుగులు చేసాడు.

ఆ తర్వాత క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ వైపు మళ్లాడు. అతను 1987 వరకు లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియం డైరెక్టర్ బోర్డులో ఉన్నాడు. పంజాబ్ స్పోర్ట్స్ బోర్డులో క్రికెట్ కోచ్‌గా ఉన్నాడు. గుల్ మొహమ్మద్ కాలేయ క్యాన్సర్‌తో మరణించాడు.

ప్రస్తావనలు

[మార్చు]