గొరెవాడ సరస్సు | |
---|---|
ప్రదేశం | నాగపూర్, మహారాష్ట్ర |
అక్షాంశ,రేఖాంశాలు | 21°11′50″N 79°2′15″E / 21.19722°N 79.03750°E |
రకం | మంచినీరు |
వెలుపలికి ప్రవాహం | పిలి నది |
ప్రవహించే దేశాలు | భారతదేశం |
ప్రాంతాలు | నాగపూర్ |
గొరెవాడ సరస్సు మహారాష్ట్ర లోని నాగపూర్ నగరానికి వాయువ్య దిశలో ఉంది. ఇది 2,350 అడుగుల పొడవు గల ఆనకట్టతో నిర్మించబడింది.[1]
1912 లో, గొరెవాడ సరస్సును నాగపూర్ లోని 1.01 లక్షల జనాభాకు ప్రాథమిక తాగునీటి వనరుగా జల వనరుల శాఖ అభివృద్ధి చేసింది. దట్టమైన అడవులతో సరిహద్దుగా ఉన్న గొరెవాడ సరస్సు, దాని పరిసరాలు ఏవియన్ జాతులకు, కొన్ని వన్యప్రాణులకు ఆవాసంగా ఉంది. సరస్సు చుట్టూ ఉన్న అటవీ ప్రాంతాలలో మహారాష్ట్ర ప్రభుత్వం 1914 హెక్టార్ల సఫారీని అభివృద్ధి చేయడం ప్రారంభించింది.[2]
కొన్ని వార్తాపత్రికల సమాచారం ప్రకారం, దేశంలో మొట్ట మొదటి నైట్-సఫారీని అక్కడే ప్రారంభించారు. ఈ ప్రతిపాదన చాలా సుదీర్ఘంగా రూపొందించబడింది, 2005 లో మొదటగా ప్రతిపాదించబడితే, 2016 లో ప్రారంభమైంది. చిరుతలు, భారతీయ జింకలు, భారతీయ నెమళ్లు, మరికొన్ని జాతులు అప్పుడప్పుడు ఈ ప్రదేశంలో కనబడతాయి.[1]
గొరెవాడ సరస్సు సమీపంలో ఉన్న రహదారిని గొరెవాడ రింగ్ రోడ్డు అని పిలుస్తారు. అనేక పచ్చిక బయళ్లు (ఓపెన్ ఎయిర్) ఈ ప్రాంతంలో ఉన్నాయి. గొరెవాడ సరస్సుకి సమీపంలో జింగాబాయి తక్లీ, బోర్గావ్, గిట్టికాడన్ వంటి ప్రాంతాలు ఉన్నాయి. ఈ సరస్సులో చేపలు పట్టడం, సముద్రపు గవ్వలను సేకరించడం వంటివి తరచుగా జరుగుతాయి.[3]