గోకుల్ (దర్శకుడు)

గోకుల్
జననం
గోకుల్

విద్యడా. అంబేద్కర్ ప్రభుత్వ న్యాయ కళాశాల, చెన్నై
వృత్తిసినిమా దర్శకుడు, స్క్రీన్ రైటర్
క్రియాశీల సంవత్సరాలు2011 – ప్రస్తుతం

గోకుల్ తమిళ చిత్రసీమలో పనిచేస్తున్న భారతీయ చలనచిత్ర దర్శకుడు. ఆయన వినోదాత్మకంగా, వాణిజ్యపరంగా విజయవంతమైన చిత్రాలను తీయడంలో ప్రసిద్ది చెందాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన విజయవంతమైన చిత్రాలలో రౌత్రం, ఇధర్కుతానే ఆసైపట్టై బాలకుమార, కాష్మోరా (2016), జుంగా, అన్బిర్కినియాల్ వగైరా ఉన్నాయి. తెలుగులోకి కాష్మోరా అదే పేరుతో, జుంగా విక్రమార్కుడు (2021)గా, రౌత్రం రౌద్రంగా అనువాదం చేయబడ్డాయి. అలాగే రౌత్రం హిందీలో నిర్భయ్ ది ఫైటర్ పేరుతో డబ్ చేశారు.[1]

ఆయన సింగపూర్ సెలూన్, కరోనా కుమార్ చిత్రాలకు కూడా పనిచేస్తున్నాడు.

కెరీర్

[మార్చు]

గోకుల్ దర్శకుడిగా రౌత్రం చిత్రంతో అరంగేట్రం చేసాడు. ఇందులో జీవా, శ్రియ శరణ్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ చిత్రం సినిమాటోగ్రఫీ, స్టంట్ కొరియోగ్రఫీ విభాగాలకు ప్రశంసలు అందుకుంది. ఇక రెండవ చిత్రం, లియో విజన్స్ నిర్మించిన ఇధర్కుతానే ఆశపట్టై బాలకుమార కాగా ఇందులో విజయ్ సేతుపతి, అశ్విన్ కాకుమాను, స్వాతి రెడ్డి, నందితా శ్వేత, పశుపతి, సూరితో సహా భారీ తారాగణం నటించారు. ఈ చలనచిత్రం చమత్కారమైన డైలాగ్‌లు, అలాగే ఇంటర్వెన్నింగ్ ప్లాట్ లైన్‌కు ప్రశంసలు అందుకుంది.[2]

ఆయన మూడవ వెంచర్ మాగ్నమ్ ఓపస్ కాష్మోరా, అధిక నిర్మాణ వ్యయంతో నిర్మించిన ఈ చిత్రంలో కార్తీ ద్విపాత్రాభినయం, నయనతార నటించారు.

ఆయన నాల్గవ చిత్రం జుంగాలో విజయ్ సేతుపతి టైటిల్ క్యారెక్టర్ పోషించి ప్రశంసలు అందుకున్నాడు.

ఆ తర్వాత ఆయన మలయాళం విమర్శకుల ప్రశంసలు పొందిన హెలెన్‌ని తమిళంలో కీర్తి పాండియన్ ప్రధాన పాత్రలో అన్బిర్కినియాల్ పేరుతో రీమేక్ చేశాడు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఆయన రాబోయే ప్రాజెక్ట్ లలో సింగపూర్ సెలూన్‌లో ఆర్జే బాలాజీ ప్రధాన పాత్రలో మీనాక్షి చౌదరి, సత్యరాజ్, రోబో శంకర్, కిషన్ దాస్, ఆన్ శీతల్ సహాయక పాత్రలు పోషిస్తున్నారు.

మూలాలు

[మార్చు]
  1. "Dubbing films save the industry".
  2. "Review: Idharkuthane Aasaipattai Balakumara is a laugh riot".