గోడం నగేశ్ | |||
![]() గోడం నగేశ్ | |||
పదవీ కాలం 2014 – 2019,2024- నుండి ప్రస్తుతం | |||
ముందు | రమేష్ రాథోడ్ | ||
---|---|---|---|
తరువాత | సోయం బాపూరావు | ||
నియోజకవర్గం | ఆదిలాబాదు లోక్‌సభ నియోజకవర్గం | ||
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యుడు
| |||
పదవీ కాలం 1994 – 1999, 1999 - 2004, 2009 - 2014, | |||
ముందు | సోయం బాపూరావు | ||
తరువాత | రాథోడ్ బాపు రావు | ||
నియోజకవర్గం | బోథ్ శాసనసభ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | జాతర్ల, బజార్‌హథ్నూర్ మండలం, ఆదిలాబాద్ జిల్లా, తెలంగాణ | 1964 అక్టోబరు 21||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | బీఆర్ఎస్, తెలుగుదేశం పార్టీ | ||
తల్లిదండ్రులు | గోడం రామారావు - భీమాబాయి | ||
జీవిత భాగస్వామి | లత | ||
సంతానం | 1 కుమారుడు, 1 కుమార్తె |
గోడం నగేశ్ (జననం 21 అక్టోబరు 1964),[1] తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. గోండు వర్గానికి చెందిన నగేశ్[2][3] బోథ్ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు (1994 – 1999, 1999 - 2004, 2009 - 2014) శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా కూడా పని చేశాడు.ఆదిలాబాదు లోక్‌సభ నియోజకవర్గం 2014 నుండి 2019 వరకు, 2024 జూన్ నుండి ప్రస్తుతం పార్లమెంట్ సభ్యుడిగా కోనసాగుతున్నాడు.[4]
గోడం నగేశ్ 1964, అక్టోబరు 21న గోడం రామారావు - భీమాబాయి దంపతులకు తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లా, బజార్‌హథ్నూర్ మండలంలోని జాతర్ల గ్రామంలో జన్మించాడు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి, ఉపాధ్యాయుడిగా పనిచేశాడు.[5]
తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన గోడం నగేశ్ 1994 అసెంబ్లీ ఎన్నికలలో బోథ్ శాసనసభ నియోజకవర్గం నుండి టిడిపి పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యాడు.[2][6][7] ఆయన తండ్రి రామారావు టిడిపి పార్టీ రెండుసార్లు బోథ్ శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. గిరిజన సంక్షేమ శాఖ మాజీ మంత్రిగా కూడా పనిచేశాడు.[8] 51,593 ఓట్లు (నియోజకవర్గంలో 65.27% ఓట్లు) సాధించిన[7] నాగేశ్, శాసనసభలో అతి పిన్న వయస్కుడైన శాసనసభ్యులలో ఒకడిగా ఉన్నాడు.[2] ఎన్నికల తర్వాత టిడిపి రాష్ట్ర ప్రభుత్వంలో షెడ్యూల్డ్ తెగల సంక్షేమం, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా నియమించబడ్డాడు.[3][9][10][11][12]
1999 ఎన్నికలలో 49,155 ఓట్లు (56.17%) సాధించి గెలుపొందాడు.[13] 2004లో జరిగిన ఎన్నికలలో 41,567 ఓట్లతో రెండవ స్థానంలో నిలిచాడు.[14] 2004 ఎన్నికల్లో ఆయన అభ్యర్థిత్వాన్ని తండ్రి వ్యతిరేకించినట్లు సమాచారం.[8] 2009 శాసనసభ ఎన్నికలలో 64,895 ఓట్లను (55.92%) సాధించి గెలుపొందాడు.[15] ఆదిలాబాద్ టీడీపీ జిల్లా శాఖ అధ్యక్షుడిగా,[16] గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్‌గా కూడా పనిచేశాడు. [8]
2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు టీడీపీని పార్టీకి రాజీనామా చేసి 2014, మార్చి 3న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధినేత కె. చంద్రశేఖర్ రావు[17] సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరాడు.[16] టీఆర్‌ఎస్ పార్టీ తరపున బోథ్ శాసనసభ స్థానానికి పార్టీ అభ్యర్థిగా ఎంపికైన నాగేశ్, ఆదిలాబాద్ లోక్ సభ ఎంపీ సీటు కోరగా,[18] 2014, ఏప్రిల్ 8న ఆదిలాబాద్ లోక్‌సభ స్థానానికి టిఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించబడ్డాడు.[19] ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేశ్ జాదవ్ పై 17,1093 ఓట్ల మెజారీటితో 16వ లోక్ సభకు పార్లమెంట్ సభ్యుడిగా గెలుపొందాడు.[20] 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సోయం బాపూ రావు చేతిలో 58,560 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
గోడం నగేశ్ 2024 మార్చి 10న ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌చుగ్ సమకంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు.[21][22]
గోడం నగేశ్ కు భారతీయ జనతా పార్టీ 2024 లోక సభ ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేసింది.2024 మే నెలలో జరిగే సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ నుండి బరిలో ఉన్నారు.[23]
2024లో ఆదిలాబాద్ లోకసభ నియోజక వర్గం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గోడం నగేష్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ పై 90,652 వేల ఓట్ల మెజార్టితో గెలుపొందాడు.[24][25]
{{cite web}}
: zero width space character in |title=
at position 10 (help)[permanent dead link]
{{cite news}}
: zero width space character in |title=
at position 6 (help)
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link)