గోదావరిఖని జి.డి.కె. |
|
[[Image:|250px|none|]] | |
ముద్దు పేరు: కోల్ సిటీ, మాంచెష్టర్ సిటి ఆఫ్ ఇండియా | |
Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere was provided for longitude without degrees also being provided. |
|
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | పెద్దపల్లి |
మండలం | రామగుండము |
పిన్ కోడ్ 505209,
505214, 505208 |
|
ఎస్.టి.డి కోడ్ 08728 |
వరిఖని,తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా, రామగుండం మండలానికి చెందిన పట్టణం.ఇది రామగుండం నగరపాలక సంస్థలో ఇది ఒక భాగం
గోదావరిఖని అనగానే మొదటగా గుర్తుకు వచ్చేది బొగ్గు గనులు.గోదావరి నది, బొగ్గు గనుల సమూహం ఉంది.ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా గోదావరి ఖని అని గీట్ల జనార్దన్ రెడ్డి (మాజీ MLC) నామకరణం చేసాడు.గోదావరి నది ఒడ్డున ఈ బొగ్గు గనులు ఉన్నందున గోదావరి (నదిపేరు) +ఖని (గని అని అర్థం) రెండిటి అర్థం వచ్చేటట్లుగా నామకరణం చేయబడింది.[1] దీనిని కోల్ సిటి అని కూడా అ౦టారు.2011 జనాభా లెక్కల ప్రకారం గోదావరిఖని (రామగుండం నగరపాలక సంస్థ) జనాభా 5, 50, 365. రామగుండం నగరపాలక సంస్థ పరిధి 94.8 చ.కి.మీ. ఉంది.ఈ ప్రాంత పరిధిలో సింగరేణి బొగ్గు గనులు, ఎన్.టి.పి.సి (2600 మె.వా.) ., ఎఫ్.సి.ఐ., ఎ.పి. జన్ కో, బస౦త్ నగర్ సిమె౦ట్ పరిశ్రమ మొదలైన పరిశ్రమలు ఉన్నాయి. ఎఫ్.సి.ఐ. నష్టాలతో మూతపడడింది. దీనిని తిరిగి పునరుద్ధరించబడంది.ఇక్కడ 10 మె.వా. సౌర విద్యుత్ కే౦ద్ర౦ కూడా ఉ౦ది.సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్లో అతి పెద్ద డివిజన్ రామగుండ౦ డివిజన్.ఇది రామగుండం కమిషనరేట్ పరిధి కింద వస్తుంది ఈ డివిజన్ రామగుండం -1, రామగుండం -2, రామగుండం -3 అను మూడు ఏరియాలను కలిగి ఉ౦ది.ఇక్కడ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను తెలంగాణాతో పాటు ఆ౦ధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు.త్వరలో తెలంగాణా ప్రభుత్వం సింగరేణి ఆధ్వరంలో నిమ్స్ తరహ ఆసుపత్రి, మెడికల్ కాలేజి ఏర్పాటు చేయనుంది.
ఇది భౌగోళికంగా ఎత్తెన ప్రా౦తం.జిల్లా కే౦ద్రం ను౦డి 65 కి.మీ. దూరాన ఉంది.ఇక్కడ వేసవి ఉష్ణోగ్రతలు 40 - 50 C ఉంటాయి.ఇది గోదావరి నది ఒడ్డున ఉంది. ఈ నది పై గల వ౦తెన కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలను కలుపుతు౦ది.
సు౦దిల్ల, పెద్ద౦పేట్, గు౦జపడుగు, ముత్యాల, లక్ష్మీపురం, వీర్లపల్లి, కమాన్ పూర్, మంగల్ పల్లి
ఇక్కడ అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు ఉన్నాయి.ఇక్కడ ప్రభుత్వ పట్టభద్ర కళాశాల, శాతవాహన విశ్వవిద్యాలయం, ఉన్నత పట్టభద్ర కళాశాల, పూర్వ పట్టభద్ర కళాశాల, సాంకేతిక కాలేజిలు, పూర్వ సాంకేతిక కళాశాలలు ఉన్నాయి.
గోదావరిఖని పట్టణానికి రోడ్డు, రామగుండం నుండి రైలు మార్గం ఉంది.రామగుండం రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉంది. ఈ స్టేషను ఢిల్లీ-చెన్నై-సికింద్రాబాద్ మార్గంలో ఉంది. ఢిల్లీ నుండి వచ్చేమార్గంలో తెలంగాణలో మొదట ఎదురయ్యే పెద్ద స్టేషను.హైదరాబాదు నుండి గోదావరిఖని పట్టణానికి 4 లైన్ల రాజీవ్ రహదారి ఉంది. గోదావరిఖని పట్టణ౦ నుండి తెలంగాణలోని అన్ని జిల్లాలకు, తెలంగాణ రాష్ట్రానికి బస్సుల సౌకర్యం ఉంది.రామగుండంలో విమానాశ్రయం ఉంది.
సింగరేణి సంస్థ కార్మికులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య సంరక్షణ కోసం హాస్పిటల్ కట్టించింది. అంతేకాక 100 పడకల ప్రభుత్వ హాస్పిటల్, వివిధ రకాల ప్రయివేటు హాస్పిటల్స్ ఉన్నాయి.
మంచినీటి వసతి కోసం రామగుండం నగర పాలక సంస్థ సింగరేణి సహాయంతో గోదావరి నది నుండి నీటిని సరఫరా చేస్తున్నారు.
పట్టణం చుట్టు, పట్టణంలో రామగుండం నగర పాలక సంస్థ, సింగరేణి అధ్వర్యంలో రోడ్లను నిర్మించారు. ఈ ఫోర్ వే రోడ్డు వ్యవస్థ అనేది హైదరాబాదును కలుపుతుంది.
ఈ పట్టణం పారిశ్రామిక ప్రాంతం కావడంతో ఇక్కడ నేరాల సంఖ్యతోపాటు ఫిర్యాదులూ ఎక్కువే ఉంటాయి. రోజుకు 200 నుంచి 300 మంది పిటిషనర్లు, సందర్శకులు స్టేషన్‌కు వస్తుంటారు. రాష్ట్రంలో అత్యంత రద్దీగా ఉండే పోలీస్ స్టేషన్లలో ఒకటైన గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆధునీకరించారు. సింగరేణి సౌజన్యంతో రూ.3.5 కోట్లతో 14,290 చదరపు అడుగుల విస్తీర్ణంలో 3 అంతస్తుల్లో నిర్మించబడిన మోడ్రన్ పోలీస్‌స్టేషన్ లో ఒకేసారి వందమంది సందర్శకులు కూర్చునేలా విజిటింగ్ హాల్, పురుషులు, మహిళలకు వాష్ రూములు, సరిల్ ఇన్‌స్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్లకు వేర్వేరుగా గదులు, అటాచ్డ్ టాయిలెట్లు, పురుష, మహిళా కానిస్టేబుళ్లకు వేర్వేరుగా హాళ్లు, డైనింగ్ హాళ్లు, పురుషులకు, మహిళలకు వేర్వేరుగా కౌన్సెలింగ్ హాళ్లు ఉన్నాయి. ఆఫీసర్లకు డైనింగ్ హాళ్లు, వాష్ రూంలతోపాటు గెస్ట్ రూంలు నిర్మించారు. యోగాకు ప్రత్యేకించి ఒక హాలుతోపాటు.. గ్రంథాలయం, సందర్శకులకు విశాలమైన పారింగ్ స్థలం కల్పించారు. ఇందులో రూ.1.50 కోట్లతో పోలీస్ అతిథి గృహం, వెల్ఫేర్ సెంటర్ కూడా నిర్మించారు.[2]
పట్టణములో సింగరేణి కార్మికులు అధికంగా ఉంటారు.