గోపాల గోపాల | |
---|---|
దర్శకత్వం | కిషోర్ కుమార్ పార్థాసాని (డాలి) |
స్క్రీన్ ప్లే | కిషోర్ కుమార్ పార్థసాని(డాలి), భూపతిరాజా, దీపక్ రాజ్ |
కథ | ఉమేశ్ శుక్లా భవేష్ మండలియా |
నిర్మాత | దగ్గుబాటి సురేష్‌బాబు, శరత్ మరార్ |
తారాగణం | దగ్గుబాటి వెంకటేష్, పవన్ కళ్యాణ్, శ్రియా |
ఛాయాగ్రహణం | జయంత్ విన్సెంట్ |
కూర్పు | గౌతంరాజు |
సంగీతం | అనూప్ రూబెన్స్ |
నిర్మాణ సంస్థలు | సురేష్ ప్రొడక్షన్స్, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ |
పంపిణీదార్లు | బ్లూ స్కై సినిమాస్ ఇంక్ (United States)[2] |
విడుదల తేదీ | 10 జనవరి 2015[1] |
సినిమా నిడివి | 153 నిమిషాలు |
దేశం | భారత్ |
భాష | తెలుగు |
బడ్జెట్ | ₹120 million[3] |
బాక్సాఫీసు | ₹91.9 million (Day 1).[4] |
గోపాల గోపాల వెంకటేష్, పవన్ కళ్యాణ్ కలిసి నటించిన తెలుగు చిత్రం. ఈ సినిమా సురేష్ ప్రొడక్షన్స్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ ప్రెవేట్ లిమిటెడ్ బ్యానర్ల పై దగ్గుబాటి సురేష్ బాబు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించారు. కిషోర్ కుమార్ పార్థాసాని (డాలి) దర్శకుదు. ఇతర సహాయక పాత్రల్లో శ్రియ శరణ్, మిథున్ చక్రవర్తి, కృష్ణుడు, ఆశిష్ విద్యార్థి, మురళీ శర్మ, పోసాని కృష్ణ మురళి నటించారు. జయనన్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ, గౌతం రాజు ఎడిటింగ్ నిర్వహించారు.అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం 2012 లో విడుదల అయిన హిందీ చిత్రం ఓహ్ మై గాడ్! (OMG) కి రీమేక్ గా తెరకెక్కింది. ఈ సినిమా ప్రధానంగా హైదరాబాదులో, కొన్ని భాగాలు విశాఖపట్నం, వారణాసిలో చిత్రీకరించబడ్డాయి. 2014 జూన్ 9 న ప్రారంభమైంది, సంక్రాంతికి విడుదలగా 2015 జనవరి 10 న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను పొందినది.
నాస్తికుడైన గోపాల్రావు (వెంకటేష్) మోసపూరిత మాటలు చెప్పి దేవుడి విగ్రహాలు అమ్ముకుని భక్తుల నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటుంటాడు. ఒకానొక సందర్భంలో దేవుడి ఉనికినే ప్రశ్నిస్తూ ఒక భక్త కూటమిని చెదరగొట్టి వారి భక్తిని అపహాస్యం చేస్తాడు. అదే రోజు రాత్రి సంభవించిన భూకంపంలో తన దుకాణం ఒక్కటే నేలమట్టమై ఎనభై లక్షల అప్పుతో నడి వీధికి వచ్చేస్తాడు. బీమా మొత్తం చెల్లించడానికి కూడా బీమా సంస్థ అంగీకరించదు. 'దేవుడి చర్య' వల్ల జరిగిన నష్టం బీమాలో కవర్ అవదని అంటే... తనకి జరిగిన నష్టాన్ని దేవుడే భర్తీ చేయాలని కోర్టుకి వెళతాడు. దేవుడి మిషన్లు నడిపే సంస్థలకి, దేవాలయాలకి, ట్రస్టులకి అన్నిటికీ సమన్లు పంపిస్తాడు. గోపాల్రావు వాదనలో న్యాయం ఉందని అతని కేసుని కోర్టు స్వీకరిస్తుంది. అయితే భక్తులు గోపాల్రావుపై పగబట్టి అతడిని చంపాలని చూస్తారు. అప్పుడు భగవంతుడే మనిషి రూపంలో (పవన్‌కళ్యాణ్) వచ్చి గోపాల్రావుని కాపాడి, అతడికి దిశా నిర్దేశం చేస్తాడు.