ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ హైదరాబాదులోని ఒక బ్యాడ్మింటన్ శిక్షణా కేంద్రం.[1] 2001 లో ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ గెలిచిన పుల్లెల గోపీచంద్ ఆధ్వర్యంలో ఇది నిర్వహించబడుతోంది. ఈ శిక్షణా కేంద్రంలో సైనా నెహ్వాల్, పి. వి. సింధు, పారుపల్లి కశ్యప్, కిడాంబి శ్రీకాంత్, గురుసాయి దత్, అరుణ్ విష్ణు లాంటి క్రీడాకారులు శిక్షణ పొందారు. [2]
2001 లో ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ గెలిచేటప్పటికి గోపీచంద్ వయస్సు 27 ఏళ్ళు. అప్పటికే అతన్ని గాయాలు వేధించేవి. తను కొద్దికాలమే ఆడగలనని తెలుసుకున్న గోపీచంద్ తరువాతి తరం క్రీడాకారుల కోసం భారత్ లో ఒక ప్రపంచ స్థాయి బ్యాడ్మింటన్ శిక్షణా కేంద్రాన్ని నెలకొల్పాలని అనుకున్నాడు. అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అతని కృషికి గుర్తింపుగా 2003 లో హైదరాబాదులోని గచ్చిబౌలి ప్రాంతంలో 5 ఎకరాల స్థలం కేటాయించింది.[3] ఈ స్థలాన్ని 45 సంవత్సరాల పాటు అతి తక్కువ లీజుకు ఇచ్చింది.[4] అదే సమయంలో గోపీచంద్ బ్యాడ్మింటన్ ఆట వస్తువుల తయారీ దారైన యోనెక్స్ తో, ఒక విదేశీ శిక్షకుడు కూడా ఉండేలా ఒక ఒప్పందం కుదుర్చుకుంటున్నాడు.[5][6]