గోపీచంద్ మలినేని | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | తెలుగు సినిమా రచయిత, దర్శకుడు |
గోపీచంద్ మలినేని తెలుగు సినిమా రచయిత, దర్శకుడు. డాన్ శీను సినిమాతో దర్శకుడిగా తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించాడు.
గోపీచంద్ ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని బొద్దులూరివారి పాళెంలో జన్మించాడు. స్వగ్రామంలో 10వ తరగతి వరకు చదువుకున్న గోపిచంద్, నెల్లూరులోని వి.ఆర్. కళాశాలలో డిగ్రీ పూర్తిచేశాడు.
శ్రీహరి హీరోగా నటించిన పోలీస్ సినిమాకు సహాయ దర్శకుడిగా సినీబీవితాన్ని ప్రారంభించిన గోపిచంద్, శ్రీహరి నాలుగు సినిమాలకు పనిచేశాడు. అనంతరం ఇవివి సత్యనారాయణ దగ్గర రెండు సినిమాలకు, శ్రీను వైట్ల దగ్గర అందరివాడు, వెంకీ, ఢీ సినిమాలకు, మురుగ దాస్ దగ్గర స్టాలిన్ సినిమాకు, శ్రీవాస్ దగ్గర లక్ష్యం సినిమాకు, మెహర్ రమేష్ దగ్గర కంత్రి, బిల్లా సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. డాన్ శీను ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యాడు.[1]
క్రమసంఖ్య | సంవత్సరం | చిత్రంపేరు | నటీనటులు | ఇతర వివరాలు |
---|---|---|---|---|
1 | 2010 | డాన్ శీను | రవితేజ, శ్రియా సరన్, అంజనా సుఖని | |
2 | 2012 | బాడీగార్డ్ | వెంకటేష్, త్రిష, సలోని | |
3 | 2013 | బలుపు | రవితేజ, శృతి హాసన్, అంజలి | |
4 | 2015 | పండగ చేస్కో | రామ్, రకుల్ ప్రీత్ సింగ్, సోనాల్ చౌహాన్ | |
5 | 2017 | విన్నర్[2] | సాయి ధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, జగపతి బాబు | |
6 | 2020 | క్రాక్[3] | రవితేజ, శృతిహాసన్ | |
7 | 2023 | వీర సింహా రెడ్డి | బాలకృష్ణ, శృతి హాసన్ | |
8 | 2025 | గేమ్ ఛేంజర్ | రామ్ చరణ్, కియారా అద్వానీ |