గోపీమోహన్ | |
---|---|
Born | పిన్నమనేని గోపీ మోహన్ 1 జూలై 1974 కురుమద్దాలి, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ |
Pen name | గోపీ, మోహన్ |
Occupation | స్క్రీన్ ప్లే, కథా రచయిత |
Years active | 2001 |
Spouse | ప్రవీణ |
గోపీమోహన్ (పిన్నమనేని గోపీ మోహన్) తెలుగు సినిమా స్క్రీన్ ప్లే, కథా రచయిత.[1]
గోపీమోహన్ 1974, జూలై 1న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా, వుయ్యూరు సమీపంలోని కురుమద్దాలి గ్రామంలో జన్మించాడు. చిన్నప్పటి నుంచి సినిమాలంటే మక్కువ.[2]
1999లో ఎన్.శంకర్ తీసిన యమజాతకుడు, 2000లో బి. గోపాల్ తీసిన వంశీ సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేశారు. 2001లో తేజ తీసిన నువ్వు నేను సినిమాకు స్క్రిప్ట్, దర్శకత్వ శాఖలో సహాయం చేసాడు.
2002లో వచ్చిన సంతోషం సినిమాకు స్క్రీన్ ప్లే రాశాడు. ఆ తరువాత దశరధ్, శ్రీనువైట్ల, సురేందర్ రెడ్డి, తేజ, జి.నాగేశ్వర రెడ్డిలతో దర్శకులతో పనిచేసి వెంకీ మిస్టర్ & మిసెస్ శైలజాకృష్ణమూర్తి, శ్రీ, అశోక్, ఢీ, దుబాయ్ శీను, లక్ష్యం, స్వాగతం, ఝుమ్మంది నాదం, ధేనికైనా రెడీ, గ్రీకు వీరుడు, దూసుకెళ్తా వంటి సినిమాలకు స్క్రీన్‌ప్లే రాశాడు.
2008లో రెడీ సినిమాకు తొలిసారిగా కథ రాశాడు. తరువాత దర్శకుడు శ్రీనువైట్ల తీసిన రెడీ, కింగ్, నమో వెంకటేశా, దూకుడు, బాద్ షా చిత్రాలకు కథలు రాశాడు. గోపీ మోహన్, కోన వెంకట్ స్క్రిప్ట్ రచయితలుగా అనేక విజయవంతమైన సినిమాలకు కలిసి పనిచేశారు.
సంవత్సరం | పేరు | భాష |
---|---|---|
1999 | యమజాతకుడు | తెలుగు |
2000 | వంశీ | తెలుగు |
2001 | నువ్వు నేను | తెలుగు |
సంవత్సరం | పేరు | భాష |
---|---|---|
2008 | రెడీ | తెలుగు |
2008 | కింగ్ | |
2009 | రామ్ | కన్నడ |
2010 | నమో వెంకటేశ | తెలుగు |
2010 | ఉత్తమ పుతిరన్ | తమిళం |
2011 | రెడీ | హిందీ |
2011 | దూకుడు | తెలుగు |
2012 | ఛాలెంజ్ 2 | బెంగాలీ |
2013 | షాడో | తెలుగు |
2013 | బాద్‍షా | |
2015 | బ్రూస్ లీ | |
2016 | డిక్టేటర్[4] | |
2017 | మిస్టర్ |