గోవింద్ పశు విహార్ జాతీయ ఉద్యానవనం | |
---|---|
Map of India | |
Location | ఉత్తరాఖండ్, భారతదేశం |
Nearest city | ధారఖాది |
Coordinates | 31°06′N 78°17′E / 31.10°N 78.29°E[1] |
Area | 958 కి.మీ2 (370 చ. మై.) |
Established | 1955 |
గోవింద్ పశు విహార్ జాతీయ ఉద్యానవనం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ధారఖాది అనే ప్రాంతంలో ఉంది.[2]
ఈ ఉద్యానవనం మార్చి 1, 1955 న స్థాపించబడింది. ఈ ఉద్యానవనం గర్హ్వాల్ హిమాలయాల ఎత్తైన ప్రదేశాలలో ఉంది. ఇది 958 చదరపు కి.మీ. వైశాల్యంలో విస్తరించి ఉంది.
ఈ ఉద్యానవనంలో సుమారు 15 జాతులకు పెద్ద క్షీరదాలు, 150 పైగా అనేకరకాల పక్షులు ఉన్నాయి. ఇందులో ఆసియాలో ఉండే నల్ల ఎలుగుబంట్లు, చిరుతపులులు, కస్తూరి జింక, భరాల్, హిమాలయ తహర్, సెరో, చిన్న క్షీరదాలలో భారతీయ క్రెస్టెడ్ పోర్కుపైన్, గోరల్, సివెట్, హెడ్జ్హాగ్, అడవి పందులు వంటి అనేక రకాల జంతువులు ఉన్నాయి..[3] ఈ ఉద్యానవనంలో భిన్న జాతులకు చెందిన పక్షులు ఉన్నాయి అందులో బంగారు ఈగిల్, స్టెప్పీ ఈగిల్, బ్లాక్ ఈగిల్, స్నోకాక్, మోనాల్ ఫెసాంట్, చీర్ ఫెసాంట్, వెస్ట్రన్ ట్రాగోపాన్ వంటి అంతరించిపోతున్న అనేక జాతులకు ఆవాసంగా ఉంది.[4]
ఈ ఉద్యానవనంలో పశ్చిమ హిమాలయ బ్రాడ్‌లీఫ్ అడవులు, సబ్‌పాల్పైన్ కోనిఫెర్ అడవులు, ఆల్పైన్ పొద, పచ్చికభూములు వంటివి ఉన్నాయి. ఈ ఉద్యానవనం దిగువ భాగాలలో ఉన్న చెట్లలో చిర్ పైన్, దేవదారు, ఓక్, సుమారు 2600 మీటర్ల ఎత్తులో ఉండే ఆకురాల్చే జాతులకు చెందిన చెట్లు ఉన్నాయి.
ఈ ఉద్యానవనం సముద్ర మట్టానికి 1,400 నుండి 6,323 మీటర్ల ఎత్తులో ఉంది. ఇందులో హర్ కి డూన్ లోయ ఉంది. దీనిపై సందర్శకులు ట్రెక్కింగ్ చేస్తారు. ఇదేకాక రూయిన్సియారా అనే ఎత్తైన సరస్సు ఉంది.[5]