గౌరీ గిల్ | |
---|---|
![]() | |
జననం | 1970 (age 54–55) చండీగఢ్, భారతదేశం |
జాతీయత | భారతీయురాలు |
చేసిన పనులు | ది మార్క్ ఆన్ ది వాల్ నోట్స్ ఫ్రమ్ ది డిజర్ట్ ది మార్క్ ఆన్ ది వాల్ జన్నత్ ట్రేసెస్ |
అవార్డులు | ప్రిక్స్ పిక్‌టెట్ (స్విట్జర్లాండ్) 2011లో గ్రాంజ్ (కెనడా) |
గౌరీ గిల్ (జననం 1970) న్యూఢిల్లీలో నివసిస్తున్న భారతీయ సమకాలీన ఫోటోగ్రాఫర్. న్యూయార్క్ టైమ్స్ చే ఆమె "భారతదేశం అత్యంత గౌరవనీయమైన ఫోటోగ్రాఫర్‌లలో ఒకరు",[1] ది వైర్‌చే "భారతదేశంలో చురుకైన అత్యంత ఆలోచనాత్మకమైన ఫోటోగ్రాఫర్‌లలో ఒకరు"[2] అని అభివర్ణించబడింది. 2011లో ఆమెకి కెనడా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సమకాలీన ఫోటోగ్రఫీ అవార్డు అయిన గ్రాంజ్ ప్రైజ్ అందించింది.[3][4]
ఆమె ఫొటో సిరీస్ ‘నోట్స్ ఫ్రమ్ ది డిజర్ట్’కి గాను ప్రతిష్ఠాత్మకమైన ప్రిక్స్ పిక్‌టెట్ అవార్డ్ గెలుచుకుంది.[5]
భారతదేశంలోని చండీగఢ్‌లో పుట్టిన గౌరి గిల్ న్యూఢిల్లీలోని ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ (ఢిల్లీ విశ్వవిద్యాలయం) నుంచి అప్లైడ్ ఆర్ట్‌లో బీఎఫ్‌ఏ చేసింది. 1994లో, ఆమె న్యూయార్క్‌లోని పార్సన్ స్కూల్ ఆఫ్ డిజైన్‌లో ఫొటోగ్రఫీలో బీఎఫ్‌ఏ పూర్తి చేసింది., 2002లో, స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీలో ఫొటోగ్రఫీలోఆమె ఎంఎఫ్‌ఏ పట్టాపొందింది.[6]
ది అమెరికన్స్ (2000–2007) కోసమని ఆమె అమెరికాలోని భారతీయ డయాస్పోరా అంతటా తన కుటుంబం, స్నేహితులను ఫోటోలు తీసింది.[7]
నోట్స్ ఫ్రమ్ ది డెసర్ట్ (1999-కొనసాగుతోంది) అని పిలువబడే గ్రామీణ రాజస్థాన్‌లోని అట్టడుగు వర్గాలపై దశాబ్ద కాలం పాటు జరిపిన అధ్యయనం ఫలితంగా ది మార్క్ ఆన్ ది వాల్, జన్నత్, బాలికా మేళా, బర్త్ సిరీస్, రూయిన్డ్ రెయిన్‌బో వంటి వ్యక్తిగత ఫెయిర్‌లు, ప్రాజెక్ట్‌లు వచ్చాయి.[8][9]
{{cite web}}
: Missing or empty |title=
(help)CS1 maint: bot: original URL status unknown (link)