గ్యారీ స్టెడ్

గ్యారీ స్టెడ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
గ్యారీ రేమండ్ స్టెడ్
పుట్టిన తేదీ (1972-01-09) 1972 జనవరి 9 (వయసు 52)
క్రైస్ట్‌చర్చ్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుLegbreak
బంధువులుDavid Stead (father)
Janice Stead (aunt)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 207)1999 మార్చి 11 - దక్షిణాఫ్రికా తో
చివరి టెస్టు1999 డిసెంబరు 26 - వెస్టిండీస్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 5 101 103
చేసిన పరుగులు 278 4,984 2,173
బ్యాటింగు సగటు 34.75 32.15 27.85
100s/50s 0/2 10/24 2/10
అత్యధిక స్కోరు 78 190 101*
వేసిన బంతులు 6 1,053 48
వికెట్లు 0 9 1
బౌలింగు సగటు 65.22 43.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 4/58 1/20
క్యాచ్‌లు/స్టంపింగులు 2/– 46/– 37/–
మూలం: Cricinfo, 2017 మే 1

గ్యారీ రేమండ్ స్టెడ్ (జననం 9 జనవరి 1972) న్యూజిలాండ్‌కు చెందిన క్రికెట్ కోచ్. ఈ మాజీ క్రికెటరును, 2018 ఆగస్టులో న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమించారు.

ఎగువ వరుస బ్యాటరైన స్టెడ్, 1999లో తొమ్మిది నెలల్లో ఐదు టెస్టులు ఆడి, 34.75 సగటు సాధించాడు. 10 లోపు ఎప్పుడూ ఔట్ కాలేదు. దక్షిణాఫ్రికాకు వ్యతిరేకంగా అతను వెల్లింగ్టన్‌లో తన గొప్ప పాత్రను కనబరుస్తూ, పాతుకుపోయి 68, 33 చేసాడు.[1] అయితే వెస్టిండీస్‌పై రెండు ఆటల్లో పెద్దగా ఆడనందున అతన్ని తొలగించారు. కాంటర్‌బరీతో ఎనిమిది సంవత్సరాల ఫస్ట్-క్లాస్ క్రికెట్ తర్వాత అతని టెస్టులకు పిలుపు వచ్చింది. 1998-99 నుండి ఐదు సీజన్లలో జట్టు కష్టపడుతున్న కాలంలో నాయకత్వం స్వీకరించాడు.

ఆడటం పూర్తయిన తర్వాత గ్యారీ, కోచింగు ఇవ్వడం మొదలుపెట్టాడు. విజయవంతమైన న్యూజిలాండ్ మహిళల జట్టుకు కోచ్ అయ్యాడు. 2018 ఆగస్టులో న్యూజిలాండ్ క్రికెట్, మైక్ హెస్సన్ తర్వాత న్యూజిలాండ్ పురుషుల జట్టుకు స్టెడ్‌ను కోచ్‌గా నియమించబడింది. [2]

2019 ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్‌పై సూపర్ ఓవర్‌లో న్యూజిలాండ్ ఓడిపోయిన తర్వాత, టై బ్రేక్‌కు వెళ్లాలన్న ఐసిసి నిర్ణయాన్ని స్టెడ్ విమర్శించాడు. ప్రపంచ కప్ ట్రోఫీని పంచుకోవాలనే ఆలోచనను లేవనెత్తాడు. ఇది 2015 ప్రపంచ కప్‌లో అమలులో ఉన్న కొత్త వ్యవస్థ. [3]

మూలాలు

[మార్చు]
  1. "New Zealand v South Africa, Wellington 1998-99". CricketArchive. Retrieved 18 August 2018.
  2. "Stead named BLACKCAPS Head Coach". New Zealand Cricket. Archived from the original on 15 August 2018. Retrieved 15 August 2018.
  3. "Sharing World Cup 'something that should be considered' - New Zealand coach". ESPNcricinfo. 2019-07-15. Retrieved 2019-07-16.