![]() | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | శాలిస్‌బరీ | 1970 డిసెంబరు 20|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | ఫ్లవర్ పవర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | Slow left arm orthodox | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | Opening బ్యాటరు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బంధువులు | Andy Flower (brother) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 7) | 1992 అక్టోబరు 18 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2004 ఫిబ్రవరి 26 - బంగ్లాదేశ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 27) | 1992 అక్టోబరు 25 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2010 అక్టోబరు 17 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 68 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1994/95–2003/04 | Mashonaland | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2002 | లీసెస్టర్‌షైర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2005–2010 | ఎసెక్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2010/11 | Mashonaland Eagles | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2022 జనవరి 6 |
గ్రాంట్ విలియం ఫ్లవర్ (జననం 1970 డిసెంబరు 20) జింబాబ్వే క్రికెట్ కోచ్, మాజీ క్రికెటరు. అతను శ్రీలంక క్రికెట్ జట్టు, పాకిస్తాన్ క్రికెట్ జట్టు, ససెక్స్ జట్లకు బ్యాటింగ్ కోచ్ గా పనిచేసాడు.
అతని స్థిరమైన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్, చక్కటి బ్యాటింగ్ నైపుణ్యాలకు గాను అతను అత్యుత్తమ జింబాబ్వే క్రికెటర్లలో ఒకడిగా రేటింగు పొందాడు. అతను వ్యాయామశాలలో గంటల తరబడి గడిపే ఫిట్‌నెస్ అభిమాని. సాధారణంగా గల్లీ స్థానంలో అద్భుతమైన ఫీల్డర్‌గా కూడా అతన్ని పరిగణిస్తారు. గ్రాంట్, అతని సోదరుడు ఆండీ ఫ్లవర్ కలయికను, "ఫ్లవర్ పవర్" గా ఒక దశాబ్దం పాటు జింబాబ్వే బ్యాటింగ్‌కు ఆధారంగా నిలబడ్డారు. [1] గ్రాంట్, జట్టులో అత్యంత విజయవంతమైన ఓపెనింగ్ బ్యాటరుగా, యాంకర్‌మన్ పాత్రను పోషించాడు.
అతను బలమైన పాకిస్తాన్ జట్టుపై జింబాబ్వే సాధించిన అత్యుత్తమ టెస్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. తన కెరీర్‌లో పాకిస్తానీ జట్టుపై సగటున 40 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. అజేయంగా 201తో సహా 3 సెంచరీలు చేశాడు. 2014 జూలైలో, అతను రెండు సంవత్సరాల పాటు పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా నియమితుడై, 2019 ఆగస్టు వరకు ఆ పదవిలో కొనసాగాడు [2] [3]
అతను రెండు వేర్వేరు ఫార్మాట్లలో ఇన్నింగ్సంతా ఆడిన మొదటి బ్యాట్స్‌మన్.
1992 ప్రపంచ కప్ తర్వాత జింబాబ్వే టెస్ట్ హోదాకు పదోన్నతి పొందింది. ఫ్లవర్ 1992 అక్టోబరు 18 న తొలి టెస్ట్ మ్యాచ్ కోసం భారత జట్టుతో ఆడేందుకు ఎంపికయ్యాడు. ఫ్లాట్ పిచ్‌పై బ్యాటింగ్ ప్రారంభించి, 100 పరుగుల ఓపెనింగ్ స్టాండ్‌లో ఆధిపత్యం చెలాయించాడు. అతను తొలి టెస్టులో 82 పరుగులు చేశాడు. [4] జింబాబ్వే ఈసారి వారి సొంత గడ్డపై మళ్లీ భారత ఆటగాళ్లతో ఆడింది. ఈసారి 96 పరుగులకు ఔటై, మళ్లీ తొలి టెస్టు సెంచరీకి దూరమయ్యాడు.
1997లో ఫ్లవర్ టెస్ట్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీ చేసిన మొదటి జింబాబ్వే ఆటగాడు. హరారేలో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో అతను 104, 151 పరుగులు చేశాడు. ఒక సంవత్సరం తర్వాత పాకిస్థాన్‌పై క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్‌లో 156 నాటౌట్‌తో తన 5వ టెస్ట్ సెంచరీ సాధించాడు. అతను ఆ ఇన్నింగ్స్ తర్వాత ఫామ్ కోల్పోయాడు. 2000 నవంబరు 25 న భారతదేశానికి వ్యతిరేకంగా 106 పరుగులు చేసాడు. అతని తదుపరి 6 ఇన్నింగ్స్‌లలో నాలుగు అర్ధ శతకాలు చేశాడు.
వన్‌డే కెరీర్ ముగిసే సమయానికి ఫ్లవర్, హీత్ స్ట్రీక్ మినహా ఇతర జింబాబ్వే బౌలర్ల కంటే ఎక్కువ వికెట్లు తీశాడు. అతని వన్‌డే గణాంకాలు అతని టెస్ట్ గణాంకాల కంటే మెరుగ్గా ఉన్నాయి. అతను 6 వన్‌డే శతకాలు చేసాడు. స్కోరు 90లలో ఉండగా 9 సార్లు అజేయంగా ఉండడం గానీ, ఔటవడం గానీ అయ్యాడు. బంగ్లాదేశ్‌లో జరిగిన వన్-డే ముక్కోణపు టోర్నమెంట్ ఫైనల్‌లో అతని చిరస్మరణీయ సెంచరీ ఒకటి. కెన్యాపై అతను 82 బంతుల్లో సెంచరీ సాధించాడు. అతను వన్‌డే చరిత్రలో జింబాబ్వే తరపున అత్యధిక క్యాచ్‌లు పట్టిన రికార్డు (86) అతని పేరిట ఉంది. [5]
ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే, వన్‌డే పూర్తి ఇన్నింగ్సంతా బ్యాటింగు చేసిన మొదటి బ్యాట్స్‌మన్, ఫ్లవర్. [6] అలా ఒక మ్యాచ్‌లో ఇన్నింగ్సంతా ఆడి జట్టును గెలిపించిన ఏఖైక బ్యాటరతను. [7] [8]
అతను 2010 అక్టోబరులో జింబాబ్వేకు బ్యాటింగ్ కోచ్‌గా నియమితుడయ్యాడు [9] 2014 మేలో పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. [10] 2019 క్రికెట్ ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ పేలవమైన ప్రదర్శన తర్వాత 2019 ఆగస్టులో పిసిబి అతని ఒప్పందాన్ని ముగించింది. [11] [12] 2017 ICC ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ విజయంలో అతను కీలక పాత్ర పోషించాడు. దీనిని ఫ్లవర్ తన వ్యక్తిగత విజయంగా భావించాడు. [13] అతను 2019-20 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌కు రంగ్‌పూర్ రైడర్స్ ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు. [14]
2019 డిసెంబరులో, అతను రెండేళ్ల కాంట్రాక్ట్‌కు శ్రీలంక బ్యాటింగ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. [15] [16] [17] [18] 2021 జూలై 8 న , శ్రీలంక, ఇంగ్లండ్ మధ్య పరిమిత ఓవర్ల సిరీస్ తర్వాత ఇంగ్లాండ్ నుండి శ్రీలంకకు తిరిగి వచ్చినప్పుడు అతనికి COVID-19 పాజిటివ్ అని తేలింది. [19] [20]
{{cite news}}
: CS1 maint: others (link)