వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | గ్రాహం థోర్న్ డౌలింగ్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | క్రైస్ట్‌చర్చ్, న్యూజీలాండ్ | 1937 మార్చి 4||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 93) | 1961 డిసెంబరు 26 - దక్షిణాఫ్రికా తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1972 మార్చి 9 - వెస్టిండీస్ తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1958/59–1971/72 | కాంటర్బరీ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2017 ఏప్రిల్ 1 |
గ్రాహం థోర్న్ డౌలింగ్ (జననం 1937, మార్చి 4) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. 39 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు, వాటిలో 19కి న్యూజీలాండ్ కెప్టెన్‌గా ఉన్నాడు. 1969, నవంబరులో పాకిస్తాన్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో న్యూజీలాండ్‌కు మొదటి విజయాన్ని అందించాడు. ఒక స్పెషలిస్ట్ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ గా, సాధారణంగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. సౌత్ ఐలాండ్ క్రికెట్ జట్టు తరపున దేశీయ క్రికెట్ ఆడాడు.
1968 నుండి 1972 వరకు వరుసగా 19 మ్యాచ్‌లలో న్యూజీలాండ్ టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. న్యూజీలాండ్‌కు భారతదేశం, పాకిస్తాన్‌లపై మొదటి టెస్ట్ విజయాలను అందించాడు.
1967-68లో క్రైస్ట్‌చర్చ్‌లో తొమ్మిది గంటలలో 239 పరుగులు చేశాడు, అది భారత్‌పై న్యూజీలాండ్ మొదటి విజయానికి దారితీసింది.[1] కెప్టెన్‌గా ఇది తన మొదటి మ్యాచ్. 2005లో దక్షిణాఫ్రికాపై శివనారాయణ్ చందర్‌పాల్ ఈ ఫీట్‌ను సమం చేసే వరకు కెప్టెన్సీ అరంగేట్రంలోనే డబుల్ సెంచరీ సాధించిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. ఆ సమయంలో, అతని 239 న్యూజీలాండ్ తరఫున అత్యధిక టెస్టు స్కోరు.
1969లో 12 టెస్టుల్లో న్యూజీలాండ్‌కు నాయకత్వం వహించాడు, ఇందులో మూడు విజయాలు ఉన్నాయి. మార్చిలో వెల్లింగ్టన్లో వెస్టిండీస్‌ను ఓడించారు, మూడు టెస్టుల సిరీస్‌ను 1-1తో పంచుకున్నారు.[2] జూన్ నుండి నవంబరు వరకు తొమ్మిది టెస్టుల సుదీర్ఘ పర్యటనలో ఇంగ్లాండ్‌తో 0–2తో ఓడిపోయారు, భారత్‌తో సిరీస్‌ను 1–1తో పంచుకున్నారు, ఆపై పాకిస్తాన్‌ను 1–0తో ఓడించారు, ఇది టెస్ట్ సిరీస్‌లో న్యూజీలాండ్‌కు మొదటి విజయం.[3]
1969-70లో ఆస్ట్రేలియా పర్యటనలో గాయంతో 1970లో తన ఎడమచేతి మధ్య వేలును కోల్పోయాడు.[4] 1971-72లో వెస్టిండీస్ పర్యటనలో వెన్నునొప్పితో బాధపడ్డాడు, రెండవ టెస్ట్ తర్వాత ఇంటికి తిరిగి రావాల్సి వచ్చింది. అదే అతడికి చివరి ఫస్ట్‌క్లాస్ మ్యాచ్.
న్యూజీలాండ్ క్రికెట్ సీఈఓగా పనిచేశాడు. 1987 న్యూ ఇయర్ ఆనర్స్‌లో, క్రికెట్‌కు చేసిన సేవలకు ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ అధికారిగా నియమించబడ్డాడు. 1995 నుండి 2008 వరకు ఐసీసీ మ్యాచ్ రిఫరీగా కూడా ఉన్నాడు. తొమ్మిది టెస్టులు, 16 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లకు అధికారిగా పనిచేశాడు.[5]