1947లో భారతదేశం విభజన జరిగాక ఘనాకు వలస వచ్చిన సింధీ వలసదారుల ద్వారా ఘనాలో హిందూమతం ప్రవేశించింది. [1] [2] స్వామి ఘనానంద సరస్వతి నేతృత్వంలోని ఘనా హిందూ మఠం, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) ద్వారా ఇది ఘనాలో చురుకుగా వ్యాపించింది. ఘనాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మతం హిందూమతం. [1]
చారిత్రికంగా జనాభా | ||
---|---|---|
సంవత్సరం | జనాభా | ±% |
2009 | 12,500 | — |
2010 | 25,000 | +100.0% |
2020 | 2,50,000 | +900.0% |
2009లో ఘనాలో 12,500 మంది హిందువులు ఉన్నారు. ఇది 2010లో 25,000కి పెరిగింది (జనాభాలో 0.1%). ప్రస్తుతం దాదాపు 2,50,000 మంది హిందువులు (జనాభాలో 0.8%) ఉన్నారు. హిందువులలో ఎక్కువ మంది స్వదేశీ ఆఫ్రికన్లు. వలసదారుల కంటే స్వదేశీ మూలాలున్న హిందువులు ఎక్కువగా ఉన్న మూడు ఆసియాయేతర దేశాలలో ఘనా ఒకటి (మొదటి రెండు రష్యా, ఉక్రెయిన్). స్వామీ ఘనానంద సరస్వతి ఘనాలో ఐదు దేవాలయాలను నిర్మించాడు. ఇవి ఆఫ్రికన్ హిందూ మఠానికి (AHM) మూలస్తంభాకుగా ఉన్నాయి. ఘనాలోని భారతీయ సంఘం కూడా AHMలో పాల్గొంటుంది. అయితే దానికి స్వంత దేవాలయాలు కూడా ఉన్నాయి (అత్యధికంగా సింధీ కమ్యూనిటీకి). [3] ISKCON కు కూడా దేశంలో ఒక మాదిరి ఉనికి ఉంది. సత్య సాయి బాబా శిష్యులు కూడా ఉన్నారు. [4] ఘనాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మతంగా హిందూమతం అని భావిస్తారు.
హిందువులు విశ్వసించే పునర్జన్మ, కర్మ సద్ధాంతం వంటి ప్రాథమిక నమ్మకాలు కాకుండా, ఘనా హిందువులకు కొన్ని నిర్దిష్ట నమ్మకాలు అభ్యాసాలూ ఉన్నాయి. మొట్టమొదటగా, ఘనాలోని ఒక వ్యక్తి హిందూ విశ్వాసాన్ని విశ్వసిస్తున్నాడనే ప్రాథమిక సూచన ఏమిటంటే, వారు మాంసాహారం తినకూడదు అనే నిర్ణయం తీసుకున్నారు. ఇది ప్రాథమిక సూచికగా పరిగణించబడుతుంది. ఎందుకంటే అక్రమ లైంగిక సంబంధాల నిషేధం, మద్యపానానికి దూరంగా ఉండటం వంటి ఇతర హిందూ పద్ధతులను సాధారణంగా ఇతర ఘనా మతాలు కూడా పాటిస్తాయి. అయితే మాంసానికి దూరంగా ఉండటం అనేది హిందువులకే ప్రత్యేకమైనది. ఘనా హిందువులు ప్రతి జీవీ పవిత్రమైనదని, సర్వోన్నతమైన దేవుని అభివ్యక్తి అనీ నమ్మి మాంసాహారానికి దూరంగా ఉంటారు. ఎవరికీ హాని చెయ్యకుండా పొందగలిగే ఇతర ఆహార వనరులు అందుబాటులో ఉన్నాయన్న స్పృహ కలిగిఉంటారు. ఈ ఆలోచన నుండి ఉద్భవించినదే, ఘనా హిందువుల రెండవ విశ్వాసం - ఆవులు పవిత్రమైన జీవులు, వాటికి హాని చేయకూడదు, పూజించాలి అనేది. కృష్ణుడు అతను గోవుల కాపరిగా అవతరించాడనే అవగాహన నుండి ఈ నమ్మకం వచ్చింది. అలాగే, వైదిక దేవత అదితి ఒక ఆవుగా చిత్రీకరించబడింది. దాని పాలు "సోమ" అనే ఉత్తేజకరమైన పానీయమని, ఇది సృష్టిని పోషిస్తుందనీ నమ్ముతారు. ఈ ఘనా హిందూ విశ్వాసం కూడా గమనించదగినది, ఎందుకంటే ఎక్కువ మంది ఘనా ప్రజలు ప్రతిరోజూ ఆవు మాంసాన్ని తినడమే కాకుండా, ఆవు శరీరం నుండి మిగిలిన వనరులను సాంప్రదాయ ఘనా జీవనశైలిలో ఇతర ఆచరణాత్మక పనులకు కూడా ఉపయోగిస్తారు. [5]
ఘనాలోని హిందువులు రెండు ప్రధాన హిందూ సంస్థలలో సభ్యులు. శైవాన్ని ఆచరించే ఆఫ్రికా హిందూ మొనాస్టరీ, వైష్ణవ మతాన్ని ఆచరించే ఇస్కాన్.
హరే కృష్ణ భక్తులు 1966లో AC భక్తివేదాంత స్వామి ప్రభుపాద స్థాపించిన ప్రపంచవ్యాప్త హిందూ మత ఉద్యమం యొక్క స్థానిక శాఖ. ఘనాలో వారి కార్యకలాపాలకు కేంద్రం అక్రా వెలుపల ఉన్న మెడీ పట్టణంలోని శ్రీ రాధా గోవింద ఆలయం. అయితే సంఘపు బహుళ-జాతి మేళవింపుకు తగినట్లుగా దేశవ్యాప్తంగా అనేక చిన్న సమూహాల భక్తులు ఉన్నారు. దీనికి విరుద్ధంగా, అకాన్లు అక్రాలోని ఒడోర్కోర్ పరిసరాల్లో ఉన్న స్వదేశీ దేవాలయమైన హిందూ ఆశ్రమంలో ఎక్కువ మంది సభ్యులను కలిగి ఉన్నారు. [6] [7] ఈ ఆలయాన్ని స్వామి ఘనానంద [8] 1975లో నిర్మించాడు.
ఇతర హిందూమత సంఘాలలో ఘనా ఆర్య సమాజ్, శ్రీ సత్య సాయి బాబా ఉద్యమం, అక్కానుమ్ నామ శివాయ హీలింగ్ చర్చి మొదలైనవి ఉన్నాయి. [7]
<ref>
ట్యాగు; Ghana's unique African-Hindu
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు<ref>
ట్యాగు; "urbanlab.org" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు