చంచల్‌గూడ
సర్వార్ జంగ్ పాంచ్ | |
---|---|
పాతబస్తీ | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాదు |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్‌కోడ్ | 500 024 |
Vehicle registration | టిఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | మలక్పేట్ శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
చంచల్‌గూడ (సర్వార్ జంగ్ పాంచ్), తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పాతబస్తీలో ఉన్న ప్రాంతం. ఇది సైదాబాద్, డబీర్‌పూర్ సమీపంలో ఉంది. ఇక్కడ చంచల్‌గూడ సెంట్రల్ జైలు ఉంది.[1]
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో చంచల్‌గూడ నుండి నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడినుండి 98 నంబరు గల బస్సులు నాంపల్లి వరకు, 78 నంబరు గల బస్సులు చార్మినార్ వరకు నడుస్తున్నాయి. ఇక్కడికి సమీపంలోని దబీర్‌పురా, యాకుత్‌పురా, మలక్‌పేటలలో ఎంఎంటిఎస్ రైల్వే స్టేషన్లు ఉన్నాయి.
చంచల్‌గుడ ప్రభుత్వ జూనియర్ కళాశాల, మోడరన్ ఉన్నత పాఠశాల, ఫరా ఉన్నత పాఠశాల, రెహమాటియా ఉన్నత పాఠశాల, సెయింట్ లారెన్స్ ఉన్నత పాఠశాల, కారామెల్ ఉన్నత పాఠశాల, నియో స్కూల్ ఐజ్జా మొదలైన విద్యాసంస్థలు ఇక్కడ ఉన్నాయి.
చంచల్‌గూడ జంక్షన్ ప్రాంతంలో 2020, జూలై 23న రాష్ట్రమంత్రి కల్వకుంట్ల తారక రామారావు చేతుల మీదుగా నల్గొండ ఎక్స్-రోడ్ నుండి చంచల్‌గుడ జంక్షన్, సైదాబాద్ జంక్షన్, ధోబిఘాట్ జంక్షన్, ఐఎస్ సదన్ జంక్షన్ మీదుగా ఓవైసీ హాస్పిటల్ జంక్షన్ వరకు 3.382 కి.మీ.ల (అందులో ఫ్లైఓవర్ 2.580 కి.మీ.) పొడవు ఏర్పాటుచేస్తున్న ఎలివేటెడ్ కారిడార్ శంకుస్థాపన జరిగింది. దీని వల్ల వెళ్ళే ప్రయాణ సమయం తగ్గుతుంది.[2][3]
{{cite web}}
: |last2=
has numeric name (help)CS1 maint: numeric names: authors list (link) CS1 maint: url-status (link)
{{cite web}}
: CS1 maint: url-status (link)