వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | చంద్రకాంత్ గులాబ్‌రావ్ బోర్డే | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | పుణే, బాంబే ప్రెసిడెన్సీ, బ్రిటిషు భారతదేశం | 21 జూలై 1934|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి వాటం లెగ్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 83) | 1958 నవంబరు 28 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1969 నవంబరు 9 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||
1952–1973 | మహారాష్ట్ర క్రికెట్ జట్టు | |||||||||||||||||||||||||||||||||||||||
1954–1955 | ముంబై క్రికెట్ జట్టు | |||||||||||||||||||||||||||||||||||||||
1954–1963 | బరోడా క్రికెట్ జట్టు | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2009 అక్టోబరు 2 |
చంద్రకాంత్ గులాబ్‌రావ్ "చందూ" బోర్డే [1] (జననం 1934 జూలై 21), 1958 - 1970 మధ్య భారత జట్టులో ఆడిన క్రికెట్ క్రీడాకారుడు. రిటైర్మెంట్ తరువాత బోర్డే, క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ అయ్యాడు. జాతీయ సెలెక్టర్ల ఛైర్మన్‌గా పనిచేశాడు. మైదానంలోనూ వెలుపలా క్రికెట్‌కు చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం ఆయనను వివిధ పురస్కారాలతో సత్కరించింది. అతని తమ్ముడు రమేష్ బోర్డే కూడా దేశవాళీ క్రికెట్‌లో వెస్ట్ జోన్, మహారాష్ట్ర తరపున ఆడాడు.[2][3] అతను 2003లో సికె నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకున్నాడు. ఇది మాజీ ఆటగాళ్ళకు బిసిసిఐ అందించే అత్యున్నత గౌరవం. [4]
2018 జూలైలో బోర్డే తన ఆత్మకథను పాంథర్స్ పేసెస్ (మోహన్ సిన్హాకు చెప్పినట్లు) పేరుతో ప్రచురించాడు.
బోర్డే పూణేలోని మరాఠీ క్రైస్తవ కుటుంబంలో జన్మించాడు. అతనికి ఐదుగురు సోదరులు, ఐదుగురు సోదరీమణులు ఉన్నారు. [5] బోర్డే, విజయ్ హజారేను తన ఆరాధ్యదైవంగా పరిగణించాడు. ఒకసారి అతనితో కలిసి ఒకే డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నాడు. [6]
1954 డిసెంబరులో అహ్మదాబాద్‌లో గుజరాత్‌పై బరోడా తరపున 1954/55 దేశీయ సీజన్‌లో బోర్డే ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆట మొదలుపెట్టాడు. హోల్కర్‌తో జరిగిన సెమీ-ఫైనల్‌లో ఆడి, డకౌట్ అయ్యాడు. తదుపరి సీజన్‌లో విజయాలు సాధించాడు. బాంబేపై తొలి సెంచరీ చేశాడు. సర్వీసెస్‌తో జరిగిన 1957/58 రంజీ ఫైనల్‌లో, హాఫ్ సెంచరీ చేసి, మ్యాచ్‌లో 5 వికెట్లు తీశాడు. అతను 1964లో మహారాష్ట్రకు ప్రాతినిధ్యం వహించాడు.
భారత్‌లో వెస్టిండీస్ పర్యటన సందర్భంగా బోర్డే తన తొలి టెస్టు ఆడాడు. మొదటి రెండు టెస్ట్‌లలో, [7] [8] అతని ప్రదర్శన సాధారణమైనది. మరో తొలి టెస్టు ఆటగాడు రామ్‌నాథ్ కెన్నీకి అనుకూలంగా మూడవ టెస్టు జట్టు నుండి అతన్ని తొలగించారు. కెన్నీ పేలవమైన ప్రదర్శన చేయడంతో, బోర్డేను వెనక్కి పిలిపించారు. ఆ టెస్టులో అతను తొలి టెస్ట్ హాఫ్ సెంచరీ చేశాడు. సిరీస్‌లోని ఐదవ, చివరి టెస్ట్‌లో, బోర్డే తన తొలి సెంచరీ చేసాడు. డ్రాగా ముగిసిన ఆ టెస్టులో బోర్డే 109, 96 పరుగులు చేసాడు. [9]
తదుపరి సిరీస్‌లో, భారతదేశం ఇంగ్లండ్‌లో పర్యటించింది. మొదటి టెస్ట్‌లో బోర్డే ఎడమ చేతి చిటికెన వేలు విరగడంతో రెండవ టెస్ట్‌కు దూరమయ్యాడు.[10] ఆ తర్వాత ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌లు భారత్‌లో పర్యటించినప్పుడు జరిగిన 11 మ్యాచ్‌లలో బోర్డే రెండు అర్ధ సెంచరీలు మాత్రమే చేశాడు. 14 వికెట్లు పడగొట్టాడు. మద్రాస్‌లో పాకిస్తాన్‌తో జరిగిన నాల్గవ టెస్టులో, [11] అతను 177* పరుగులు చేసాడు. అది అతని రెండవ సెంచరీ, అత్యధిక టెస్ట్ స్కోరు కూడా. శతకం సాధించిన పాలీ ఉమ్రిగర్‌తో కలిసి 177 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించాడు.
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన నాల్గవ టెస్టులో ఇంగ్లండ్‌పై భారతదేశం సాధించిన మొదటి విజయంలో బోర్డే కీలక పాత్ర పోషించాడు.[12] మొదటి టెస్టులో రెండు అర్ధ సెంచరీలు (68, 61), 3 వికెట్లు సాధించాడు. మద్రాస్‌లో జరిగిన తదుపరి టెస్టులో బోర్డే ఐదు వికెట్లు పడగొట్టడంతో భారత్ మళ్లీ గెలిచింది.
1961/62లో వెస్టిండీస్‌లో భారతదేశ పర్యటన నిరాశపరిచింది.[13] 5–0 తో సీరీస్ కోల్పోయింది. బోర్డే 24.4 సగటుతో 244 పరుగులు చేసి ఆరు వికెట్లు మాత్రమే తీసి పేలవమైన ప్రదర్శన చూపాడు. తర్వాతి రెండు సిరీస్‌లలో (భారత్‌లో ఇంగ్లాండ్ పర్యటన, [14] ఆస్ట్రేలియాలో భారత పర్యటన [15] ) 42.55 సగటుతో 383 పరుగులు చేసి ఎనిమిది టెస్టుల్లో పది వికెట్లు తీసి మెరుగైన ప్రదర్శన చూపాడు.
న్యూజిలాండ్ 1964/65లో భారత్‌లో పర్యటించింది. బోర్డే మూడో టెస్టులో బొంబాయిలోని బ్రాబౌర్న్ స్టేడియంలో సెంచరీ సాధించాడు. [16] [17] ఆ సిరీస్‌లో అతను చేసిన మూడు సెంచరీలలో ఇది ఒకటి. అతను 60.81 సగటుతో 371 పరుగులు చేశాడు. బోర్డే చివరిగా అంతర్జాతీయ స్థాయిలో బౌలింగ్ చేసినది కూడా ఈ సిరీస్ లోనే.
విజయవంతమైన ఆ న్యూజిలాండ్ సిరీస్ తరువాత వెస్టిండీస్‌తో జరిగిన స్వదేశీ సిరీస్‌లో కూడా బోర్డే రెండు సెంచరీలతో మరో గొప్ప వ్యక్తిగత ప్రదర్శన చూపాడు. భారత్ మూడు టెస్టుల ఆ సిరీస్‌ను 2-0తో కోల్పోయింది. [18]
1967 లో బార్బడాస్‌తో ఆడి మొఇగతా ప్రపంచ జట్టులో ఎంపికైన భారతీయుడు బోర్డే ఒక్కడే.[19]
1967 డిసెంబరులో అడిలైడ్ ఓవల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో బోర్డే భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. తదుపరి మ్యాచ్‌లో కెప్టెన్‌గా పటౌడీ ఆ స్థానానికి తిరిగి వచ్చాడు.
ఆస్ట్రేలియాలో కెప్టెన్‌గా అతని ఏకైక టెస్టు కాకుండా బోర్డే, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ పర్యటనలలో చూపిన ప్రదర్శనలు నిరాశ కలిగించాయి. 11 టెస్టుల్లో కేవలం నాలుగు హాఫ్ సెంచరీలతో 24.67 సగటుతో 468 పరుగులు చేశాడు. యువకులను ఎంపిక చేయాలనే విధానంలో భాగంగా బోర్డేను జట్టు నుండి తొలగించారు. బ్రాబౌర్న్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టెస్టు తర్వాత అతని స్థానంలో గుండప్ప విశ్వనాథ్‌ని తీసుకున్నారు.
జాతీయ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా బోర్డే రెండు సార్లు పనిచేశాడు:
సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా తన బాధ్యతలతో పాటు, బోర్డే భారత క్రికెట్‌కు సంబంధించిన ఇతర పనులను నిర్వహించాడు, వీటిలో:
క్రికెట్‌కు చేసిన కృషికిగాను బోర్డే, భారత ప్రభుత్వం నుండి, బిసిసిఐ నుండి పలు పురస్కారాలను అందుకున్నాడు:
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link)