బాబా చంద్రగుప్ چندرگپ चन्द्रगुप | |
---|---|
![]() | |
స్థానం | |
దేశం: | పాకిస్తాన్ ![]() |
రాష్ట్రం: | బెలూచిస్తాన్ |
జిల్లా: | లాస్బెలా జిల్లా |
ప్రదేశం: | హింగ్లాజ్ |
ఎత్తు: | 100 మీ. (328 అ.) |
భౌగోళికాంశాలు: | 25.0°26′43.33″N 65.0°51′55.55″E / 25.4453694°N 65.8654306°E |
చంద్రగుప్ అనేది పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లోని హింగోల్ నేషనల్ పార్క్‌లో ఉన్న క్రియాశీల మట్టి అగ్నిపర్వతం. దీనిని చంద్రకూప్ అని కూడా పిలుస్తారు, ఈ అగ్నిపర్వతంను హిందువులు పవిత్రమైనదిగా భావిస్తారు, శ్రీ హింగ్లాజ్ మాత ఆలయానికి వెళ్లే యాత్రికులు ఈ స్థలాన్ని తప్పక దర్శించుకుంటారు.[1]
చంద్రగుప్ మట్టి అగ్నిపర్వతం హిందూ దేవుడైన శివుని స్వరూపంగా పూజించబడుతుంది. దీనిని బాబా చంద్రగుప్ అని కూడా పిలుస్తారు. అగ్నిపర్వతం వద్దకు వెళ్లే యాత్రికులు బాబా చంద్రకూప్‌కు నివాళులర్పించిన తర్వాత మాత్రమే శ్రీ హింగ్లాజ్ మాత ఆలయంలోకి ప్రవేశించాలని నమ్ముతారు. ఇక్కడ సాంప్రదాయకంగా, యాత్రికులు రాత్రంతా మేల్కొని ఉంటారు, ఉపవాసం ఉండి, మరుసటి రోజు విరమించుకుని, చంద్రకూప్ పర్వతంపైకి ఎక్కుతారు. బాబా చంద్రకూప్‌కు రోటీని నైవేద్యంగా అందిస్తారు. ఈ రోజుల్లో, కొబ్బరికాయలు, తమలపాకులు, పప్పు కూడా అందిస్తున్నారు. అగ్నిపర్వతం శిఖరం వద్ద, యాత్రికులు తమ పూర్తి పేరు, మూలం ప్రదేశంతో తమను తాము పరిచయం చేసుకుంటారు. బురద బుడగలు, గాలి ప్రతిచర్యను బట్టి, యాత్రికుల పాపాలు క్షమించబడతాయో లేదో చరిదార్ చెప్పగలడు.[2][3]