చంద్రహాసన్ రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ అధినేత, సినిమా నిర్మాత. ఆయన ప్రముఖ భారతీయ సినిమా నటులైన కమల్ హాసన్, చారుహాసన్ ల సోదరుడు.[1]
ఆయన వృత్తి రీత్యా న్యాయవాది. ఆయన కమల్ హాసన్ నిర్మించిన ‘అపూర్వ సహోదరులు’, ‘హేరామ్’, ‘విరుమాండి’, ‘ముంబై ఎక్స్‌ప్రెస్’, ‘ఉన్నైపోల్ ఒరువన్’ చిత్రాలకు సహనిర్మాతగా వ్యవహరించారు. చంద్రహాసన్ ప్రస్తుతం కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థ 'రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్'కి అధినేతగా వ్యవహరిస్తున్నారు. తన ఇద్దరు సోదరులు సినిమాల్లో నటించినప్పటికీ ఆయన మాత్రం తెర వెనుక ఉండి పనిచేయడానికి ఇష్టపడ్డారు. ఆయన కుమార్తె అను హాసన్ ఇందిర, రన్, ఆల్వంధన్ తదితర సినిమాల్లో నటించారు. ఇప్పుడు కూడా 'ఈజ్ దిస్ నౌ' అనే ఇంగ్లీష్ సినిమాలో చేస్తున్నారు. 'విశ్వరూపం' సినిమా విడుదల విషయంలో ఆటంకాలు వచ్చినప్పుడు చంద్రహాసన్ తన వెంటే ఉండి ధైర్యం చెప్పారని ఆయనే తన బలమని కమల్‌హాసన్ ఇదివరకు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. చంద్రహాసన్ 'విరుమంది', 'విశ్వరూపం', 'థూంగవనమ్' చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు.[2]
ఆయన లండన్‌లో ఉన్న తన కుమార్తె అనుహాసన్ వద్ద మార్చి 18 2017 న గుండెపోటుతో మరణించారు.[3] ఆయన భార్య గీతామణి (73) జనవరి 7 2017న మరణించారు.[4]