చపాక్ | |
---|---|
దర్శకత్వం | మేఘనా గుల్జార్ |
రచన | అతిక చోహన్ మేఘనా గుల్జార్ |
నిర్మాత | ఫాక్స్ స్టార్ స్టూడియోస్ దీపికా పదుకొనె గోవింద్ సింగ్ సందు మేఘనా గుల్జార్ |
తారాగణం | దీపికా పడుకోణె విక్రాంత్ మాస్సే విశాల్ దహియా అంకిత్ బిష్ట్ |
ఛాయాగ్రహణం | మలే ప్రకాష్ |
కూర్పు | నితిన్ బైద్ |
సంగీతం | బ్యాక్గ్రౌండ్ సంగీతం : శంకర్-ఎహసాన్-లాయ్ తబ్బి పాటలు: శంకర్–ఎహసాన్ - లాయ్ |
నిర్మాణ సంస్థలు | ఫాక్స్ స్టార్ స్టూడియోస్ క ప్రొడక్షన్స్ అవెర్న్స్ ప్రొడక్షన్స్ మ్రిగా ఫిలిమ్స్ |
పంపిణీదార్లు | ఫాక్స్ స్టార్ స్టూడియోస్ |
విడుదల తేదీ | 10 జనవరి 2020 |
సినిమా నిడివి | 120 నిమిషాలు[1] |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
బడ్జెట్ | 36 కోట్లు[2] |
బాక్సాఫీసు | 55.44 కోట్లు[3] |
చపాక్ 2020లో విడుదలైన హిందీ సినిమా. యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, కా ప్రొడక్షన్స్, అవెర్న్స్ ప్రొడక్షన్స్, మ్రిగా ఫిలిమ్స్ బ్యానర్ల పై ఫాక్స్ స్టార్ స్టూడియోస్, దీపికా పదుకోన్, గోవింద సింగ్ సాందు, మేఘనా గుల్జార్ నిర్మించిన ఈ సినిమాకు మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించింది. దీపికా పడుకోణె, విక్రాంత్ మాసే, విశాల్ దహియా, అంకిత్ బిష్ట్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2020 జనవరి 10న విడుదలైంది.
మాలతి (దీపికా పదుకోన్) స్కూల్లో అప్పుడప్పుడే అబ్బాయిలతో పరిచయాలు పెరిగే పరువంలోకి అడుగుపెడుతుంది. ఆమె స్నేహితుడు బబ్బూ (విశాల్ దహియా) ప్రేమిస్తున్నానని వెంటపడతాడు. దానికి ఆమె ఒప్పుకోదు. మాలతి తనకు నచ్చిన రాజేష్ (అంకిత్ బిష్ట్ ) తో సన్నిహితంగా ఉంటుంది. అది నచ్చని బబ్బూ ఒకసారి ఆమెను మందలిస్తాడు. కానీ ఆమె బెదరదు, దీంతో తన వదిన సాయంతో మాలతిపై యాసిడ్ దాడి చేయగా మాలతి ముఖం పూర్తిగా కాలిపోతుంది. మాలతీ తరువాత కుటుంబసభ్యులు, సన్నిహితులు ఇచ్చిన భరోసాతో సామజిక కార్యకర్తగా మారుతుంది. ఆ క్రమంలోనే అమోల్ (విక్రమంత్ మాసే) తో అనుబంధం పెరిగి ఆమెకు అతడిని ప్రేమిస్తుంది. అమోల్ మనసు మాలతి ప్రేమను గ్రహించిందా? వారిద్దరి జీవితాలు ఎలా మారాయి? ఆ తర్వాత ఏమైంది ? ఆమెపై దాడి చేసిన బబ్బూకి శిక్ష పడిందా ? అనేదే మిగతా సినిమా కథ.[4]