చమర కపుగెదర

చమర కపుగెదర
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
చమర కాంత కపుగెదర
పుట్టిన తేదీ (1987-02-24) 1987 ఫిబ్రవరి 24 (వయసు 37)
కాండీ నగరం, శ్రీలంక
మారుపేరుకపు
ఎత్తు5 అ. 11 అం. (1.80 మీ.)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడి చేయి మీడియం
పాత్రమిడిల్-ఆర్డర్ బ్యాట్స్‌మన్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 104)2006 మే 11 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు2009 ఆగస్టు 26 - న్యూజీలాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 129)2006 జనవరి 29 - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే2017 అక్టోబరు 18 - పాకిస్తాన్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.16
తొలి T20I (క్యాప్ 6)2006 జూన్ 15 - ఇంగ్లాండ్ తో
చివరి T20I2017 ఏప్రిల్ 6 - బంగ్లాదేశ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2005/06–presentColombo Cricket Club
2008–2010చెన్నై సూపర్ కింగ్స్
2013Duronto Rajshahi
2015Chittagong Vikings
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు T20I
మ్యాచ్‌లు 8 102 43
చేసిన పరుగులు 418 1,624 703
బ్యాటింగు సగటు 34.83 21.09 22.67
100s/50s 0/4 0/8 0/1
అత్యధిక స్కోరు 96 95 50
వేసిన బంతులు 12 264
వికెట్లు 0 2
బౌలింగు సగటు 112.50
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 1/24
క్యాచ్‌లు/స్టంపింగులు 6/– 31/– 17/–
మూలం: ESPNricinfo, 2017 ఆగస్టు 20

చమర కాంత కపుగెదర (జననం 1987, ఫిబ్రవరి 24), శ్రీలంక మాజీ క్రికెటర్. క్రికెట్ లోని అన్ని ఫార్మాట్‌లలో ఆడాడు. మాజీ వన్డే అంతర్జాతీయ కెప్టెన్.

తొలి మ్యాచ్ నుండి 2010 వరకు జాతీయ జట్టులో శాశ్వత సభ్యుడిగా ఉన్నాడు. క్యాండీ ధర్మరాజా కళాశాలలో చదివాడు. శ్రీలంక తరపున మొదటి ట్వంటీ 20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో కూడా సభ్యుడిగా ఉన్నాడు. కపుగెదర 2015 మధ్యలో జాతీయ జట్టులోకి తిరిగి ప్రవేశించి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ గా రాణించాడు. 2017 డిసెంబరులో అతను అన్ని రకాల క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు.[1]

దేశీయ వృత్తి

[మార్చు]

2005లో శ్రీలంక ఎ తరపున న్యూజిలాండ్ ఎతో జరిగిన మ్యాచ్‌లో కపుగెదెర ఫస్ట్-క్లాస్ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు.[2] దేశవాళీ క్రికెట్‌లో కొలంబో క్రికెట్ క్లబ్‌కు ఆడాడు. 2012లో శ్రీలంక ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కోసం కపుగెదెరా ఉతుర రుద్రస్‌లో చేర్చబడ్డాడు. బస్నాహిరా క్రికెట్ డూండీతో జరిగిన మ్యాచ్ విన్నింగ్ నాక్‌లో 69 పరుగులు చేశాడు.[3]

అంతర్జాతీయ కెరీర్

[మార్చు]

కపుగెదెరా 2006లో పెర్త్‌లో ఆస్ట్రేలియాపై వన్డే అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. 2006 మేలో లండన్‌లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టెస్టులో తన టెస్ట్ క్రికెట్ అరంగేట్రం చేసాడు. అందులో మొదటి ఇన్నింగ్స్‌లో మొదటి బంతికి డకౌట్ అయ్యాడు. 2006లో జరిగిన విబి సిరీస్ మొదటి ఫైనల్‌లో 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్‌లతో సహా 38 పరుగుల ఇన్నింగ్స్‌కు కూడా పేరు పొందాడు.

2009లో పాకిస్తాన్‌తో జరిగిన రెండవ వన్డేలో, కపుగెదెర అజేయంగా 69 పరుగులు చేసి శ్రీలంకను గెలిచి సిరీస్‌ని 2-0తో ముందంజలో ఉంచాడు.[4]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

తమరా డెరెక్‌తో 2010 డిసెంబరు 16న కపుగెదెరా వివాహం జరిగింది. వివాహ వేడుక బత్తరముల్లాలోని వాటర్స్ ఎడ్జ్ హోటల్‌లో జరిగింది.[5][6] వీరికి ముగ్గురు పిల్లలు అక్షన్, యెనిత్, యావిన్.[7][8]

మూలాలు

[మార్చు]
  1. Kumarasinghe, Chathura (24 December 2019). "Chamara Kapugedara retires from all forms of cricket". The Papare. Retrieved 2023-08-30.
  2. "New Zealand A tour of Sri Lanka at Colombo, Oct 19–22 2005". ESPNcricinfo. ESPN Inc. Retrieved 2023-08-30.
  3. Fernando, Andrew Fidel (21 August 2012). "Kapugedera gem downs Basnahira". ESPNcricinfo. ESPN Inc. Retrieved 2023-08-30.
  4. Premachandran, Dileep (1 August 2009). "Kapugedera pilots Sri Lanka to 2–0 lead". ESPNcricinfo. ESPN Inc. Retrieved 2023-08-30.
  5. "Chamara Kapugedera and Tamara talk". Lankan Stuff. 2 January 2011. Retrieved 2023-08-30.
  6. "Kapugedera and wife on their Wedding Day". Island Cricket. 11 March 2017. Archived from the original on 18 ఆగస్టు 2016. Retrieved 30 ఆగస్టు 2023.
  7. Rao, Sujan (11 March 2017). "Chamara Kapugedera with his wife and kids". Island Cricket. Archived from the original on 2022-12-04. Retrieved 2023-08-30.
  8. "Chamara Kapugedera Speaks About His Wife". Gossip Lanka. 11 March 2017. Retrieved 2023-08-30.

బాహ్య లింకులు

[మార్చు]