చలపతిరావు | |
---|---|
జననం | తమ్మారెడ్డి చలపతిరావు [1] 1944 మే 8 కృష్ణాజిల్లా పామర్రు మండలంలోని బల్లిపర్రు |
మరణం | 2022 డిసెంబరు 25 హైదరాబాదు | (వయసు 78)
మరణ కారణం | గుండెపోటు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | నటుడు , నిర్మాత |
జీవిత భాగస్వామి | ఇందుమతి |
పిల్లలు | ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి రవిబాబు |
తల్లిదండ్రులు |
|
చలపతిరావు అలియాస్ తమ్మారెడ్డి చలపతిరావు (1944 మే 8 - 2022 డిసెంబరు 25) సుప్రసిద్ద తెలుగు సినీ నటుడు. ఇతను పన్నెండు వందల పైగా సినిమాల్లో పలు రకాలైన పాత్రల్లో నటించాడు. ఆయన స్వస్థలం కృష్ణాజిల్లా పామర్రు మండలంలోని బల్లిపర్రు. నాన్న పేరు మణియ్య. అమ్మ వియ్యమ్మది పక్కనే ఉన్న మామిళ్ళపల్లి . 1966లో విడుదలైన గూఢచారి 116 సినిమాతో ఆయన చిత్రపరిశ్రమలో అడుగుపెట్టాడు. కాగా తన చివరి చిత్రం 2021లో విడుదలైన బంగార్రాజు. ఎన్టీఆర్ కృష్ణ నాగార్జున చిరంజీవి వెంకటేష్ చిత్రాల్లో ఆయన సహాయ నటుడిగా ప్రతి నాయకుడిగా నటించి అందరి ప్రశంసలు అందుకున్నాడు కలియుగ కృష్ణుడు కడప రెడ్డమ్మ జగన్నాటకం పెళ్లంటే నూరేళ్లపంట తదితర సినిమాలకు చలపతిరావు నిర్మాతగా వ్యవహరించారు యమగోల యుగపురుషుడు డ్రైవర్ రాముడు అనార్కలి బాలకృష్ణుడు జస్టిస్ చౌదరి సర్దార్ రాముడు బొబ్బిలి పులి చట్టంతో పోరాటం దొంగరాముడు అల్లరి అల్లుడు అల్లరి నిన్నే పెళ్లాడతా నువ్వే కావాలి సింహాద్రి బన్నీ బొమ్మరిల్లు అరుంధతి సింహ దమ్ము లెజెండ్ ఇలా ఎన్నో వందల చిత్రాల్లో ఆయన కీలకపాత్రలు పోషించారు అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా నటనకు దూరంగా ఉన్నా చలపతిరావు గుండెపోటుతో 2022 డిసెంబర్ 25న తెల్లవారుజామున తుది శ్వాస విడిచాడు
ఆయనకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. ఆడపిల్లలు అమెరికాలో ఉంటారు. వాళ్లు ఇండియా వచ్చినప్పుడు పిల్లలందరితో కలిసి బల్లిపర్రు వెళుతుంటారు. అక్కడ ఉన్న వారికి స్వంత ఇల్లు, రెండెకరాలు పొలం ఉంది.
ఈ వ్యాసాన్ని పూర్తిగా అనువదించి, తరువాత ఈ మూసను తీసివేయండి. అనువాదం చేయాల్సిన వ్యాస భాగం ఒకవేళ ప్రధాన పేరుబరిలో వున్నట్లయితే పాఠ్యం సవరించు నొక్కినప్పుడు కనబడవచ్చు. అనువాదం పూర్తయినంతవరకు ఎర్రలింకులు లేకుండా చూడాలంటే ప్రస్తుత ఆంగ్ల కూర్పుని, భాషల లింకుల ద్వారా చూడండి(అనువాదకులకు వనరులు) |
చలపతిరావు 78 సంవత్సరాల వయసులో హైదరాబాదులోని తన నివాసంలో గుండెపోటుతో కన్నుమూశారు.[18] ఆయన భార్య ఇందుమతి గతంలోనే అగ్ని ప్రమాదంలో చనిపోయింది. ఆయనకు కొడుకు రవిబాబు, ఇద్దరు కుమార్తెలు మాలినిదేవి, శ్రీదేవి ఉన్నారు.[19]
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)