చింతకింది మల్లేశం | |
---|---|
![]() చింతకింది మల్లేశం | |
జననం | |
వృత్తి | చేనేత కార్మికుడు, ఆవిష్కర్త |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | ఆసు యంత్రం సృష్టికర్త |
తల్లిదండ్రులు |
|
చింతకింది మల్లేశం చేనేత కార్మికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత.[1] ఈయన చేనేత కార్మికులకు శ్రమ తగ్గించేందుకు గాను ఆసు యంత్రాన్ని కనుక్కున్నాడు. 2019లో ఈయన జీవితం ఆధారంగా మల్లేశం అనే సినిమా వచ్చింది.
తెలంగాణ రాష్ట్రం లోని యదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం షారాజీపేటలో జన్మించారు.
ఆర్థిక ఇబ్బందులతో స్కూల్ చదువు 6వ తరగతిలోనే ఆపేశాడు. చేనేత వృత్తిలో ఆధారపడిన తల్లి లక్ష్మీకి చేదోడు వాదోడుగా ఉండేవాడు.[2] ప్రైవేటుగా 7వ తరగతి చదివి, 10వ తరగతి కూడా పాసయ్యాడు.[3]
చేనేతకు సంబంధించిన ఆసు యంత్రాన్ని కనుగొన్నందుకు పద్మశ్రీ ఈయన ఈ అవార్డును అందుకున్నారు.
చింతకింది మల్లేశంది నిరుపేద చేనేత కుటుంబం. అమ్మచీరలు నేస్తుంది. ఒక చీరకు ఆసు పోయడానికి దారాన్ని పిన్నుల చుట్టు 9వేల సార్లు అటూ ఇటూ తిప్పాలి. ఇలా రోజుకి 18వేల సార్లు దారాన్ని కండెల చుట్టూ తిప్పితే గాని (25 కి.మీ) రెండు చీరలు తయారుకావు. దారాన్ని కండెల చుట్టూ తిప్పుతుంటే మల్లేషం తల్లి చేతులు లాగుతూ ఉండేవి. అమ్మ భుజం నొప్పితో రోజంతా బాధపడుతుంటే అమ్మ కష్టం గట్టేక్కేదెలా ఏదో ఒకటిచేయాలనుకున్నాడు. తనకొచ్చిన ఆలోచనను ఇరుగుపొరుగుతో పంచుకున్నాడు. వాళ్లు నిరుత్సాహపరచినా తన ఆశయం నెరవేర్చకోవడంకోసం హైదరాబాద్ వచ్చాడు. పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ ఆసు యంత్రాన్ని పార్టులు పార్టులుగా తయారుచేశాడు. మొత్తం యంత్రం తయారుచేయడానికి ఏడేళ్లు పట్టింది.
అమ్మ పేరుమీదనే 2000ల సంవత్సరంలో లక్ష్మీ ఆసు యత్రం కనిపెట్టాడు. 2011 సంవత్సరంలో ఈ యంత్రానికి పేటెంట్ హక్కులు వచ్చాయి. అదే సంవత్సరం చివరలో ఫోర్బ్స్ జాబితాలో మల్లేశం పేరు చోటు చేసుకుంది. 2011లో ఆసు యంత్రానికి సాఫ్ట్ వేర్ జత చేస్తామని అమెరికా ముందుకు వచ్చింది.[4] ఆసు యంత్రం ఆసియాలో ది బెస్ట్ అని అమెరికాకు చెందిన పాట్ లాబ్స్ ప్రశంసించింది. అదే ఏడాది ఉత్తమ గ్రామీణ ఆవిష్కర్తగా రాష్టప్రతి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాడు.[5]