చింతామణి దేవాలయం | |
---|---|
స్థానం | |
దేశం: | భారతదేశం |
రాష్ట్రం: | మహారాష్ట్ర |
జిల్లా: | పూణె జిల్లా |
ప్రదేశం: | థేర్ |
భౌగోళికాంశాలు: | 18°31′25.67″N 74°2′46.62″E / 18.5237972°N 74.0462833°E |
నిర్మాణశైలి, సంస్కృతి | |
నిర్మాణ శైలి: | దేవాలయ శైలీ |
చింతామణి దేవాలయం, మహారాష్ట్ర, పూణె జిల్లా లోని థేర్ ప్రాంతంలో ఉన్న వినాయకుడి దేవాలయం.[1] ఇది మహారాష్ట్రలోని అష్టవినాయక దేవాలయాలలో పెద్దది, ప్రసిద్ధమైనది.
వినాయకుడు తన భక్తుడైన కపిల ఋషి, చింతామణిని ఎలా తిరిగి పొందాడో, థేర్‌లో తన గురించి ధ్యానం చేసిన బ్రహ్మ దేవుడు ఎలా శాంతింపజేశాడో ఈ దేవాలయ పురాణం వివరిస్తోంది. ఈ దేవాలయానికి గణపత్య సెయింట్ మోర్యా గోసావి (13 నుండి 17వ శతాబ్దానికి చెందినది)కి సంబంధం ఉంది. ఈ దేవాలయం పురాతన కాలం నుండి ఉనికిలో ఉందని నమ్ముతున్నప్పటికీ, ప్రస్తుత దేవాలయ నిర్మాణం మోర్యా చేతగానీ లేదా మోర్యా వంశస్థుల చేతగానీ నిర్మించబడింది. చింతామణి దేవాలయం పీష్వా పాలకులకు ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంది. మొదటి మాధవరావు (1745–1772) దేవాలయ నిర్మాణానికి పునర్నిర్మాణం, చేర్పులు చేశాడు.
అష్టవినాయక దేవాలయలాల సమూహంలో ఐదవ దేవాలయంగా సూచించబడినప్పటికీ, యాత్రికులు మోర్గావ్ తర్వాత సమూహంలో రెండవ స్థానంలో ఉన్న థేర్ దేవాలయాన్ని తరచుగా సందర్శిస్తుంటారు.[2]
థేర్ గ్రామం పూణె జిల్లా లోని హవేలీ తాలూకాలో ఉంది.[3] భీమా, ములా-ముఠా నదుల సంగమానికి సమీపంలో ఉంది.[4]
థేర్ అనే పేరు సంస్కృత పదం స్థవర్ నుండి ఉద్భవించింది. మరొక పురాణం ప్రకారం, బ్రహ్మ దేవుడు ఇక్కడ ధ్యానం చేసాడు, వినాయకుడి ఆశీర్వాదం కారణంగా అతని చంచలమైన మనస్సు స్థిరంగా మారింది. బ్రహ్మ తన చింతలను (చింతలు) వదిలించుకున్నాడు కాబట్టి చింతామణి అని పిలువబడ్డాడు.[5] మరొక కథ ప్రకారం, గౌతమ మహర్షి శాపం నుండి విముక్తి కోసం దేవ-రాజు ఇంద్రుడు ఇక్కడ కదంబ చెట్టు క్రింద వినాయకుడిని పూజించాడు. ఈ ప్రదేశాన్ని కదంబ చెట్ల పట్టణంగా కదమబా-నగర్ అని పిలిచేవారు.[3]
మోర్యా గోసావి తన స్వస్థలమైన చించ్వాడ్, అష్టవినాయక దేవాలయాలలో అగ్రగామి అయిన మోర్గావ్ మధ్య తన పర్యటనలలో తరచుగా ఈ దేవాలయాన్ని సందర్శించేవాడు. పౌర్ణమి తర్వాత ప్రతి నాల్గవ చాంద్రమాన రోజున, మోర్యా థేర్ దేవాలయాన్ని సందర్శించేవాడు.[6] ఒక కథ ప్రకారం, గురువు ఆజ్ఞ ప్రకారం, థేర్ వద్ద మోర్యా 42 రోజుల పాటు కఠినమైన ఉపవాసంతో కూడిన తపస్సు చేసాడు.[7] మోర్యాకు వినాయకుడు పులి రూపంలో కనిపించి అతనికి సిద్ధి (ఆధ్యాత్మిక శక్తులు) ఇచ్చాడని నమ్ముతారు.
పూణే సమీపంలోని ఇతర వినాయక దేవాలయాలతోపాటు థేర్ దేవాలయం, 18వ శతాబ్దంలో మరాఠా సామ్రాజ్యంలోని బ్రాహ్మణ పీష్వా పాలకుల నుండి రాచరిక పోషణను పొందింది. వినాయకుడిని తమ కులదైవంగా ఆరాధించే పేష్వాలు ఈ వినాయకు దేవాలయాలకు భూమి, నగదు, బంగారాలను (థేర్, మోర్గావ్ దేవాలయాలకు) విరాళంగా ఇచ్చారు.[2]మొదటి మాధవరావు, ఏదైనా యుద్ధంలో పాల్గొనే ముందుకానీ, యుద్ధం తర్వాత యుద్ధంలో విజయం సాధించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ దేవాలయాన్ని సందర్శించేవాడు.[8] మాధవరావు తన చివరి రోజులు దేవాలయ ప్రాంగణంలోనే గడిపాడు.[9] పీష్వా మొదటి బాజీరావు సోదరుడు, సైనిక కమాండర్ చిమాజీ అప్ప, పెద్ద యూరోపియన్ గంటను విరాళంగా ఇచ్చాడు. అది ఇప్పటికీ దేవాలయంలో వేలాడుతోంది. వసాయి కోటను స్వాధీనం చేసుకున్న తర్వాత పోర్చుగీసు వారి నుండి దానిని తీసుకొచ్చాడు.[3][8]
ప్రస్తుతం, ఈ దేవాలయం చించ్వాడ్ దేవస్థాన్ ట్రస్ట్ నిర్వహణలో ఉంది. ఇది మోర్గావ్, సిద్ధాటెక్ అష్టవినాయక దేవాలయాలను కూడా నిర్వహిస్తుంది.[10]
ఈ దేవాలయంలో మూడు ప్రధాన పండుగలు జరుగుతాయి. వినాయక చవితి పండుగకు అనుగుణంగా ఉండే గణేశ ప్రకటోస్తవ్. ఈ పండుగను హిందూ మాసం భాద్రపద మొదటి నుండి ఏడవ రోజు వరకు జరుపుకుంటారు. ఈ సందర్భంగా జాతరను కూడా నిర్వహిస్తారు. మాఘోత్సవం పండుగ హిందూ మాసం మాఘ నాల్గవ రోజున వచ్చే వినాయక జయంతి సందర్భంగా జరుగుతుంది. ఒకటి నుండి ఎనిమిదో తేదీ వరకు దేవాలయంలో ఉత్సవాలు జరుగుతాయి. జాతర కూడా నిర్వహిస్తారు. కార్తీక మాసంలోని ఎనిమిదవ రోజున రామ-మాధవ్ పుణ్యొస్తవ్ దేవాలయ అత్యంత ప్రసిద్ధ పోషకుడు మాధవరావు, అతని భార్య రమాబాయి వర్ధంతి సందర్భంగా ఈ పండుగ జరుగుతుంది. అతని అంత్యక్రియల చితిపై సతిసహగమనం ఆచరించి అతనితో దహనం చేయబడింది.[3][9]
{{cite book}}
: |work=
ignored (help)