చిట్టెమ్మ మొగుడు | |
---|---|
దర్శకత్వం | ఎ.కోదండరామిరెడ్డి |
రచన | రాజ్ కపూర్ (కథ) పరుచూరి సోదరులు (చిత్రానువాదం, మాటలు) |
నిర్మాత | పి. శ్రీధర్ రెడ్డి |
తారాగణం | మోహన్ బాబు, దివ్యభారతి, పూజా బేడి, బ్రహ్మానందం |
ఛాయాగ్రహణం | ఎం.వి. రఘు |
కూర్పు | గౌతంరాజు |
సంగీతం | కె.వి.మహదేవన్ |
విడుదల తేదీ | 5 ఏప్రిల్ 1992 |
సినిమా నిడివి | 140 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
చిట్టెమ్మ మొగుడు 1993, ఫిబ్రవరి 11 విడుదలైన తెలుగు చలనచిత్రం. ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోహన్ బాబు, దివ్యభారతి, పూజాబేడీ, బ్రహ్మానందం నటించగా, కె.వి.మహదేవన్ సంగీతం అందించాడు.[1][2] తమిళ చిత్రం తాలాట్టు కేత్కుతామా కు రిమేక్ చిత్రమిది.
చిట్టి (దివ్య భారతి) సరదాగా ఉండే అమ్మాయి. ఆమె ముగ్గురు చిన్నపిల్లలైన స్నేహితులతో ఆడుకుంటూ ఉంటుంది. ఒకసారి ఆట ఆడుతున్నప్పుడు, నీ తల్లి చనిపోయినట్టుగా నీవు కూడా బిడ్డని కని పురిట్లోనే చనిపోతావు అని ఒక వృద్ధుడు ఆమెను శపిస్తాడు. ఆ ఊరిలో ఒక గర్భిణీ స్త్రీ రాత్రి నొప్పులు రావడంతో ఆ బాధను భరించలేక చనిపోతుంది. దాంతో పిల్లల్ని కనడం గురించి చిట్టి భయపడుతుంది. అయితే, అదే గ్రామానికి వచ్చిన సాయి కృష్ణ (మోహన్ బాబు) చిట్టితో స్నేహం చేసి,.ఆమె తల్లిదండ్రుల అంగీకారంతో చిట్టిని పెళ్ళి చేసుకుంటాడు. గర్భం భయంతో చిట్టి సాయికృష్ణను దగ్గరికి రానివ్వదు. దాంతో సాయికృష్ణ అసంతృప్తిగా ఉంటాడు. ఆ ఊరికి వచ్చిన వైద్యురాలు (పూజా బేడి) ని చూసి ఆకర్షితుడైన సాయికృష్ణ మత్తులో మునిగి ఇంటికి వెళ్ళి చిట్టిపై అత్యాచారం చేస్తాడు. మరుసటి రోజు ఉదయాన్నే, కోపంగా ఉన్న చిట్టిని ఓదార్చడానికి సాయికృష్ణ ప్రయత్నిస్తాడు. కాని చిట్టి కోపంతో తన తల్లిదండ్రుల వద్దకు తిరిగి వెళ్ళిపోతుంది. ఆమెను తిరిగి తీసుకురావడానికి సాయికృష్ణ ప్రయత్నిస్తాడు. కానీ చిట్టి అంగీకరించదు. చిట్టి గర్భవతి అవుతుంది. ఆ తరువాత ఏం జరిగిందనేది మిగతా కథ.
ఈ చిత్రానికి కె.వి. మహదేవన్ సంగీతం అందించాడు.[3][4]